‘నిధుల విడుదల హర్షనీయం'
దిశ, మెదక్: చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అపన్నహస్తం అందించిందని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్షుడు బూర మల్లేశం అన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 26,500 మంది చేనేత కార్మికులు, 2,337 మంది సొసైటీ కార్మికులకు చేనేత చేయూత పొదుపు పథకం కింద రూ. 31 కోట్లు విడుదల చేసింది. వీటికి అదనంగా మరో రూ.62 కోట్ల జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ నిధులు […]
దిశ, మెదక్: చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అపన్నహస్తం అందించిందని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్షుడు బూర మల్లేశం అన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 26,500 మంది చేనేత కార్మికులు, 2,337 మంది సొసైటీ కార్మికులకు చేనేత చేయూత పొదుపు పథకం కింద రూ. 31 కోట్లు విడుదల చేసింది. వీటికి అదనంగా మరో రూ.62 కోట్ల జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించటం హర్షించదగ విషయమని మల్లేశం అన్నారు. చేనేత చేయూత పొదుపు పథకం కింద లాక్ ఇన్ పీరియడ్ ముగియకున్నా రూ.93కోట్లు విడుదల చేసిన ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలీల తరపున మల్లేశం కృతఙ్ఞతలు తెలిపారు.