తెలంగాణ ఓపెన్ స్కూల్ డైరెక్టర్ సస్పెన్షన్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పొన్నూరు వెంకట శ్రీహరిని విధుల నుంచి తొలగిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన ఓ ఆత్మహత్య కేసులో శ్రీహరి రెండో నిందితుడిగా ఉన్నారు. కేసు నమోదైన సమయంలో శ్రీహరి సమగ్ర శిక్ష విభాగంలో రాష్ట్ర అదనపు ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్నారు. సదరు కేసులో శ్రీహరికి భాగస్వామ్యం ఉన్నదని […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పొన్నూరు వెంకట శ్రీహరిని విధుల నుంచి తొలగిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన ఓ ఆత్మహత్య కేసులో శ్రీహరి రెండో నిందితుడిగా ఉన్నారు. కేసు నమోదైన సమయంలో శ్రీహరి సమగ్ర శిక్ష విభాగంలో రాష్ట్ర అదనపు ప్రాజెక్టు డైరెక్టర్గా ఉన్నారు. సదరు కేసులో శ్రీహరికి భాగస్వామ్యం ఉన్నదని ఆధారాలు ఉండటంతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ -1991 నిబంధనల ప్రకారం విధుల నుంచి తొలగిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. శ్రీహరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.