అబద్దాలు చెప్పడం మోడీ, కేసీఆర్‌కు అలవాటే: రేవంత్‌

దిశ; వెబ్‌డెస్క్: అబద్దాలు చెప్పడం ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటేనని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందని, ఉత్తరాదివారికే కేంద్రమంత్రి పదవులు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికల ఆలోచనను మోడీ విరమించుకోవాలని, అదే జరిగితే దేశం రెండుగా విడిపోతుందని విమర్శించారు. రాజ్యాంగానికి సవరణలు చేసినప్పుడు కేంద్రం తెచ్చిన […]

Update: 2021-02-01 04:52 GMT

దిశ; వెబ్‌డెస్క్: అబద్దాలు చెప్పడం ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటేనని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం పార్లమెంట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందని, ఉత్తరాదివారికే కేంద్రమంత్రి పదవులు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికల ఆలోచనను మోడీ విరమించుకోవాలని, అదే జరిగితే దేశం రెండుగా విడిపోతుందని విమర్శించారు. రాజ్యాంగానికి సవరణలు చేసినప్పుడు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు.

Tags:    

Similar News