ఒకటి, రెండేండ్లలో కేసీఆర్ పదవి దిగిపోవడం ఖాయం.. తీన్మార్ మల్లన్న
దిశ, శేరిలింగంపల్లి: కల్వకుంట్ల దోపిడీ వర్గాన్ని అమరవీరుల స్థూపానికి కట్టేసే సమయం ఆసన్నమైందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. వారి మెడలు వచ్చేందుకు యావత్తు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. గచ్చిబౌలి డివిజన్ గోపన్‌పల్లి బసవతారక నగర్‌లో పేదల గుడిసెలు కూల్చారు. ఈ నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్‌తో కలిసి ఆయన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల గుడిసెలను కూల్చిన కలెక్టర్ సైతం స్పందించక పోవడం ఏంటని ప్రశ్నించారు. […]
దిశ, శేరిలింగంపల్లి: కల్వకుంట్ల దోపిడీ వర్గాన్ని అమరవీరుల స్థూపానికి కట్టేసే సమయం ఆసన్నమైందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. వారి మెడలు వచ్చేందుకు యావత్తు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. గచ్చిబౌలి డివిజన్ గోపన్‌పల్లి బసవతారక నగర్‌లో పేదల గుడిసెలు కూల్చారు. ఈ నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్‌తో కలిసి ఆయన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల గుడిసెలను కూల్చిన కలెక్టర్ సైతం స్పందించక పోవడం ఏంటని ప్రశ్నించారు.
అధికారులు సైతం బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే వారందరికి తగిన రిప్లై ఇస్తామన్నారు. స్థానిక పోలీసులు పేదలపై దాడులకు దిగడం, చంపుతామని బెదిరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని అలాంటి పద్దతి మానుకోవాలని హితవుపలికారు. కేసీఆర్ ఇంకెంతో కాలం పదవిలో ఉండరని, ఒకటి, రెండేండ్లలో పదవీ దిగిపోవడం ఖాయమన్నారు. అధికారులు పక్షపాతంతో వ్యవహరించకుండా చట్టాలకు లోబడి వాటి పరిధిలో పనిచేయాలని అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ తమ బతుకులు ఆగం చేశారని, చిన్నపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని తెలిపాడు.
ఇదెక్కడి బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించి బసవతారక నగర్ పేదలకు న్యాయం చేయాలని, వారికి న్యాయం జరిగే వరకు బీజేపి పోరాడుతుందన్నారు. కేసీఆర్ పడుకునేందుకు ప్రగతి భవన్, తిరిగేందుకు ఫామ్ హౌస్, కునికేందుకు ఓ సచివాలయం కట్టుకుంటున్నాడు అన్నాడు. సీఎం కేసీఆర్ ఇస్తానన్న లక్ష బెడ్ రూంలు ఏమయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, స్థానికులు, బాధిత కుటుంబాలకు చెందిన వారు పాల్గొన్నారు.