ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. ఐఫోన్ కాఫీ టేబుల్ వచ్చింది!
దిశ, ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే.. సబ్బులు, బండరాళ్లు, ఇటుకలు ఇతరత్రా వస్తువులు వచ్చిన ఘటనలెన్నో చూశాం. ఇటీవల చైనాలో కూడా ఓ మహిళకు ఇలాగే మోసపోయింది. లక్ష రూపాయల కన్నా విలువైన యాపిల్ ఐఫోన్ ఆర్డర్ చేసిన మహిళ.. పార్శిల్‌లో యాపిల్ డ్రింక్ రావడం చూసి షాక్ అయింది. ఇలాంటి మోసాలు జరగడం కొత్తేమీ కాదు. థర్డ్ పార్టీ సెల్లర్ల నుంచి వచ్చే పార్శిళ్లలో ఇలాంటి స్కామ్స్ జరుగుతుంటాయి. కానీ చైనా మహిళ యాపిల్ […]
దిశ, ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే.. సబ్బులు, బండరాళ్లు, ఇటుకలు ఇతరత్రా వస్తువులు వచ్చిన ఘటనలెన్నో చూశాం. ఇటీవల చైనాలో కూడా ఓ మహిళకు ఇలాగే మోసపోయింది. లక్ష రూపాయల కన్నా విలువైన యాపిల్ ఐఫోన్ ఆర్డర్ చేసిన మహిళ.. పార్శిల్‌లో యాపిల్ డ్రింక్ రావడం చూసి షాక్ అయింది. ఇలాంటి మోసాలు జరగడం కొత్తేమీ కాదు. థర్డ్ పార్టీ సెల్లర్ల నుంచి వచ్చే పార్శిళ్లలో ఇలాంటి స్కామ్స్ జరుగుతుంటాయి. కానీ చైనా మహిళ యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసినప్పటికీ, ఇలాంటి మోసమే జరగడం షాకిచ్చింది. ఈ సంగతి పక్కనబెగితే తాజాగా థాయ్‌లాండ్ యువకుడి విషయంలోనే ఇలాగే జరిగింది. అయితే ఆ కుర్రాడు మాత్రం మార్కెట్ ధర కన్నా చవకగా వస్తుందన్న కారణంతో ఓ వెబ్‌సైట్‌లో ఐఫోన్ ఆర్డర్ చేశాడు. తీరా పార్శిల్ డెలివరీ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే.. యాపిల్ స్మార్ట్‌ఫోన్ ఆకారంలో ఉన్న కాఫీ టేబుల్ ఉంది.
సాధారణంగా ఒక లగ్జరీ ఉత్పత్తిని దాని మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు అమ్ముడవుతున్నప్పుడు, ప్రతీది సక్రమంగా ఉందో లేదో చెక్ చేసుకోవటం మన బాధ్యత. కానీ ప్రొడక్ట్ కొనాలనే ఉత్సాహం, తక్కువ ధరలో వస్తుందనే ఆశతో.. ఏదీ ఆలోచించకుండా ‘బై’ బటన్ నొక్కేస్తాం. పార్శిల్ వచ్చాక మోసపోయామని తెలుసుకుని బాధపడతాం. థాయ్‌లాండ్ యువకుడి విషయంలోనూ ఇదే జరిగింది. ఆ టీనేజర్ తన పేరును చెప్పలేదు, కానీ సోషల్ మీడియాలో అతడికి వచ్చిన పార్శిల్ ప్రొడక్ట్ (ఐఫోన్ ఆకారంలో ఉన్న టేబుల్ పోస్ట్) ఫొటోలు షేర్ చేయగా, వైరల్ అయ్యాయి. అందుకే ఎప్పుడైనా ఓ ప్రొడక్ట్ కొనేముందు జెన్యూన్ వెబ్‌సైట్‌లో మాత్రం ఆర్డర్ చేయాలి. ఒకటికి పదిసార్లు అన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాకే మనీ పే చేయాలి. డోర్ డెలివరీ చేశాకే మనీ పే చేసే ఆప్షన్ ఎంచుకోవడం ఇంకా ఉత్తమం.