అబ్బాయి పుడితేనే కుటుంబం సంపూర్ణమవుతుందా?

దిశ, ఫీచర్స్ : సృష్టికి మూలంగా ‘అమ్మ’ను కొలుస్తాం, ఇంటికి మహాలక్ష్మిగా ‘అమ్మాయి’ని భావిస్తాం. ఏ పండుగొచ్చినా, ఇంట్లో ఏ పూజా కార్యక్రమమైనా ఇంటి ఆడబిడ్డతోనే హారతి పట్టిస్తాం. కానీ ఇప్పటికీ పురిట్లోనే ‘ఆడపిల్ల’ల గొంతు నులుముతున్న సంఘటనలెన్నో. ‘పాపాయి’ పుడితే.. కోడల్ని ఇంటికి రానివ్వని ఉదంతాలు ఎన్నో. తొలి కాన్పులో ‘అమ్మాయి’ పుట్టిందంటే ఆనందపడే కుటుంబాలు, తల్లిదండ్రులను వేళ్ల మీద లెక్కించవచ్చంటే అతిశయోక్తి కాదేమో. అయితే అబ్బాయిలు తమ వంశాన్ని నిలబెడతారని భావించే ప్రతీ ఒక్క […]

Update: 2021-02-19 11:13 GMT

దిశ, ఫీచర్స్ : సృష్టికి మూలంగా ‘అమ్మ’ను కొలుస్తాం, ఇంటికి మహాలక్ష్మిగా ‘అమ్మాయి’ని భావిస్తాం. ఏ పండుగొచ్చినా, ఇంట్లో ఏ పూజా కార్యక్రమమైనా ఇంటి ఆడబిడ్డతోనే హారతి పట్టిస్తాం. కానీ ఇప్పటికీ పురిట్లోనే ‘ఆడపిల్ల’ల గొంతు నులుముతున్న సంఘటనలెన్నో. ‘పాపాయి’ పుడితే.. కోడల్ని ఇంటికి రానివ్వని ఉదంతాలు ఎన్నో. తొలి కాన్పులో ‘అమ్మాయి’ పుట్టిందంటే ఆనందపడే కుటుంబాలు, తల్లిదండ్రులను వేళ్ల మీద లెక్కించవచ్చంటే అతిశయోక్తి కాదేమో. అయితే అబ్బాయిలు తమ వంశాన్ని నిలబెడతారని భావించే ప్రతీ ఒక్క కుటుంబం, ఆ వంశాన్ని నిలబెట్టడానికి కారణం మరో ఇంటి ఆడబిడ్డలే అని గుర్తించాలి. ఈ క్రమంలో ఇప్పటికి కూడా ‘కుమారుడు’ పుడితేనే.. కుటుంబానికి ప్రతిష్ఠగా భావించే వారికి ఇండియన్ టెలివిజన్ నటి తీజయ్ సిద్ధు తన లేఖతో కౌంటర్ ఇచ్చింది.

కెనడా నటి, టెలివిజన్ హోస్ట్, రేడియో పర్సనాలిటీ అయిన తీజయ్ సిద్ధు.. పంజాబీ సినిమాలు, ఇండియా టెలివిజన్ షోలతో భారతీయులకు చేరువైంది. ఈమె ఇండియన్ ఫిల్మ్, టెలివిజన్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, డిజైనర్ కరణ్‌వీర్ బొహ్రాను 2006లో వివాహం చేసుకుంది. అతడిని మనోజ్ బొహ్రా అని కూడా పిలుస్తారు. ఈ సెలెబ్రిటీ కపుల్స్‌కు ఇప్పటికే ట్విన్ డాటర్స్ వియన్నా, రాయ బెల్లా ఉండగా, డిసెంబర్‌లో వారి ఇంట్లో మరో ఏంజెల్ అడుగుపెట్టింది. ఆ చిన్నారి జన్మించి రెండు నెలలు గడిచిన సందర్భంగా, తమ అభిమానులకు తమ కూతురు ‘గియా వెనెస్సా స్నో’ ను పరిచయం చేస్తూ ఓ వీడియోను పంచుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా, తీజయ్‌కు తెలిసిన ఓ వ్యక్తికి కూడా ఇటీవలే కొడుకు పుట్టాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తనకు కంగ్రాట్స్ చెప్పిన తీజయ్.. అక్కడ కనిపించిన కొన్ని కామెంట్స్ చూసి బాధపడుతూ, ఇప్పటికీ చాలా మంది కొడుకు మత్తులోనే ఉన్నారని, కొడుకు పుడితేనే కుటుంబం సంపూర్ణమవుతుందని భావిస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని చెబుతూ ఓ లేఖను పంచుకుంది.

‘ఫిబ్రవరి 15… ఈ రోజు ఫ్యామిలీ డే. అయితే యాజ్ యూజ్‌వల్.. ఎప్పటిలాగే నా పోస్ట్ ఆలస్యంగా పోస్ట్ చేస్తున్నాను! వాస్తవంగా నేను మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఇటీవల, నాకు తెలిసిన ఓ వ్యక్తికి ఒక అబ్బాయి పుట్టాడు(వారికి అప్పటికే ఒక అమ్మాయి ఉంది). నాకు తెలిసిన మరొకరు.. ‘అభినందనలు, ఇప్పుడు మీ కుటుంబం పూర్తయింది!’ అని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్ నాకు కొద్దిగా నిరాశ కలిగించింది. అబ్బాయి పుట్టినప్పుడు మాత్రమే కుటుంబం ‘పూర్తి’ అవుతుందా? ఆ వ్యక్తికి మరో అమ్మాయి పుట్టిందని అనుకుందాం. దీని అర్థం వారి కుటుంబం ‘అసంపూర్ణంగా ఉన్నట్లా? ఒక్క బిడ్డను కలిగి ఉన్నా అది అదృష్టమే. ఆ తర్వాత మీకు ఎంత మంది పుట్టారు, వారి జెండర్ ఏంటి? అనే అంశాలు మీ ‘పరిపూర్ణతను’ నిర్ణయించకూడదు. ఆ వ్యాఖ్య అంత అఫెన్సివ్ కాదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ యంగర్ జనరేషన్, సోషల్ మీడియాలో పంచుకునే ఆలోచనల పట్ల మరింత బాధ్యత వహించాలి. అందరూ కలిసి ఉంటేనే కుటుంబం, లెట్స్ సెలబ్రేట్ ఫ్యామిలీ. నా వరకు నా కుటుంబ ఆనందమే నన్ను కంప్లీట్ చేస్తుంది’ అని తీజయ్ లేఖలో పేర్కొంది.

ఈ తరం వ్యక్తులు కూడా అమ్మాయి, అబ్బాయిల మధ్య వివక్ష చూపడం విచారకరం. ఉత్తమ సమాజానికి అమ్మాయిలు, అబ్బాయిలు రెండు కళ్లలాంటి వాళ్లని అందరూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News