Goat Boti: మేక బోటీ లాగించేవాళ్ళు .. వీటి గురించి తప్పక తెలుసుకోవాలంటున్న నిపుణులు
మేక లోని అన్ని భాగాలు తినేస్తారు.
దిశ, వెబ్ డెస్క్ : ఆదివారం వస్తే చాలు.. మనలో చాలా మంది నాన్‌వెజ్ ( Non-vegetarian ) తెచ్చుకుని తింటుంటారు. వాటిలో బాగా ఇష్టంగా తినేది మటన్ . అంతేకాకుండా, మేక లోని అన్ని భాగాలు తినేస్తారు. బోటీ, తలకాయ, రక్తం, మేక కాళ్లు ఇలా ఏది కూడా వదలకుండా తినేస్తారు. మేక ( Goat) ఆకులను తింటుంది కాబట్టి మన శరీరానికి కావాల్సిన పోషకాలు దీని వలన అందుతాయి. అయితే, బోటి ( Boti) తినేవాళ్ళు దీని గురించి తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే, కొందరు మేక పేగులను అదే పనిగా తింటుంటారు. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో విటమిన్‌లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఉంటాయి. మేక పేగులలో ఉండే ఐరన్ బ్లడ్ లో హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
మేక పేగుల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యం, జుట్టు పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ A, విటమిన్ E వంటి కొవ్వులో కరిగే విటమిన్లు చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతే కాదు, దీనిని తీసుకోవడం వలన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. మేక పేగులు తినడం వలన శరీరానికి బలాన్ని ఇస్తుంది. మార్కెట్లో తక్కువ ధరకి వస్తుందని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
Read More ...
Noodles: న్యూయర్ రోజున పొడవాటి నూడుల్స్ తప్పక తినాలంట.. ఎందుకంటే?