Vegitables: కూరగాయలు కూడా ప్రాణాలు తీస్తున్నాయా.. ఆ తప్పు చేస్తే ఇక అంతే సంగతి!

నిపుణులు కూరగాయల మీద ప్రయోగాలు చేసి షాకింగ్ నిజాలను వెల్లడించారు

Update: 2024-12-30 11:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మందికి రసాయనిక ఎరువులతో పండించిన కూరగాయలు ( Vegitables) తినొచ్చా? లేదా అనే సందేహం ఉంది. అయితే, నిపుణులు కూరగాయల మీద ప్రయోగాలు చేసి షాకింగ్ నిజాలను వెల్లడించారు. అయితే, కూరగాయలను తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చూద్దాం..

ఈ రోజుల్లో వచ్చే ఎన్నో వ్యాధులకు రసాయనిక కూరగాయలే కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, మనకి మార్కెట్‌లో దొరికే కూరగాయల్లో రసాయనాలే ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

మనం వారంలో క్యాబేజీని (Cabbage) రెండు సార్లు తింటాము. ఇది మన రోజువారీ ఆహారంలో భాగం. కానీ, వాటిపై పిచికారీ చేసే మందుల వలన అవి విషపూరితంగా మారుతున్నాయి. వేసిన పంటలను కీటకాల నుంచి కాపాడుకునేందుకు రైతులు మోతాదుకు మించిన రసాయనాలను వాడుతున్నారని నిపుణులు వెల్లడించారు. ఇది కూరగాయలను విషపూరితం చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, కూరగాయలను వండుకునే ముందు బాగా కడిగి కుక్ చేసుకోవడం మంచిది. లేదా వేడి నీటిలో పది నిముషాలు నానబెట్టడం వలన మందుల ప్రభావం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Read More ...

Goat Boti: మేక బోటీ లాగించేవాళ్ళు .. వీటి గురించి తప్పక తెలుసుకోవాలంటున్న నిపుణులు


Tags:    

Similar News