New Year Celebrations : సరదాగా గడిపేద్దాం.. 2024కు గుడ్ బై చెప్పేద్దాం..
New Year Celebrations : సరదాగా గడిపేద్దాం.. 2024కు గుడ్ బై చెప్పేద్దాం..
దిశ, ఫీచర్స్ : కాలం పరుగెడుతూనే ఉంది. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాల్సిందే. ఈ 2024కి గుడ్ బై చెప్తూ.. 2025 వెల్కం చెప్పే క్రమంలో 31 నాడు ఎలా సెలబ్రేట్ చేసుకుందామనే విషయంలో యూత్ ఇప్పటికే ఓ క్లారిటీతో ఉంది. ఇక నుంచి మందు మానేయాలని కొందరు, సిగరెట్ మానేయాలని మరికొందరు. ఫలానా విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండాలని ఇంకొందరు. గత సంవత్సరం ఎలాగో గడిచింది.. వచ్చే సంవత్సరంలోనైనా అనుకున్నది సాధించాలనే లక్ష్యంతో మరికొందరు తమ తమ ప్రణాళికలతో సిద్ధం అవుతున్నారు.
సాధారణంగానే ప్రజల్లో, యూత్‌లో ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఏంటంటే.. 31 రోజు ఎలా గడిపితే .. ఆ సంవత్సరమంతా అలాగే ఉండే అవకాశం ఉందని కొందరు భావిస్తారు. ఇది అపోహ అయినప్పటికీ .. ఏదైతేనేం ఎంజాయ్ చేయడానికి ఓ అవకాశమైతే దొరుకుతుందని చాలామంది ఫాలో అయిపోతుంటారు. కొత్త సంవత్సరంలో ఇక మందు కొట్టొద్దనుకున్నవారు లాస్ట్ డే పేరుతో 31 నాడు తినాలనుకుంటారు. న్యూ ఇయర్‌లో ఫలానా ఆహారాలు తినకూడదనుకున్నవారు చివరి సారిగా 31 నాడు తిని మానేద్దామనుకుంటారు. ఇలా అనేక విషయాల్లో థర్టీఫస్ట్ సెంటిమెంట్‌ను వాడేస్తుంటారు మనోళ్లు.
మందు గొట్టి మజా చేయడానికి, రోడ్లపై తిరగడానికి, డ్యాన్సులు వేయడానికి పోలీసుల పర్మిషన్ ఎలాగూ ఉండదు. కాబట్టి ఇంట్లోనే ఎంజాయ్ చేద్దామని ఇప్పటికే అనేకమంది ఫిక్స్ అయిపోయుంటారు. పిల్లలు, పెద్దలు, ఆత్మీయులతో కలిసి సంతోషంగా, సరదాగా గడిపేందుకు రెడీ అయిపోయారు చాలామంది. ఇక కొందరు యూత్ పోరగాల్లైతే.. పబ్బుల్లో, రిసార్టుల్లో పార్టీలతో, డీజే డ్యాన్సులతో తమదైన రీతిలో ఎంజాయ్ చేసేందుకు మస్తు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఒక్కరోజు సరదా.. సరదాగా గడిపేస్తే.. ఇక ఫస్టు నుంచి గోల్ వైపు సీరియస్‌గా అడుగేయాలని భావించేవాళ్లు, సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగాలని స్ట్రాంగ్ డెసిషన్‌తో ఉన్నారు. చూడాలి మరి ఈరోజును ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తారో.. కొత్త సంవత్సరంలో ఏం సాధిస్తారో ! సో.. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్... హ్యాపీ న్యూ ఇయర్!!
Read More..