Netflix కీలక నిర్ణయం.. పాస్‌వర్డ్ షేరింగ్‌కు డబ్బులు..!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కొత్తగా మరో లేటెస్ట్ అప్‌డేట్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కొత్తగా మరో లేటెస్ట్ అప్‌డేట్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ యూజర్లు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఇతరులతో షేర్ చేయడానికి అదనంగా డబ్బులు చెల్లించే సిస్టంను తీసుకురానుంది. దీంతో భారీగా ఆదాయాన్ని సంపాదించాలని సంస్థ భావిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ యూజర్ల సంఖ్య 2023 నాటికి రికార్డు స్థాయిలో 23.25 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. పెయిడ్ పాస్‌వర్డ్ షేరింగ్ సిస్టం రాబోయే రెండు నెలల్లో అందుబాటులోకి రావచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారులు తమ అకౌంట్ పాస్‌వర్డ్‌ను షేర్ చేయాలంటే అదనంగా డబ్బులు చెల్లించడం ద్వారా పాస్‌వర్డ్ షేరింగ్ దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని, అలాగే, కంపెనీకి భారీ మొత్తంలో ఆదాయ సమకూరడం తో పాటు వచ్చిన ఆదాయాన్ని కంటెంట్ అభివృద్దికి ఉపయోగించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.