WhatsApp నుంచి ఈసారి అదిరిపోయే ఫీచర్..!
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆధరణ కలిగిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురావాలని చూస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆధరణ కలిగిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకురావాలని చూస్తుంది. వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లను పంపే మాదిరిగా వీడియో మెసేజ్‌లను కూడా పంపే కొత్త ఫీచర్‌ను కంపెనీ టెస్టింగ్ చేస్తుంది. iOS బీటా వెర్షన్ 23.12.0.71, Android బీటా వెర్షన్ 2.23.13.4లో కంపెనీ ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్లు WABetaInfo పేర్కొంది. స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి కింద ఆప్షన్లలో వీడియో రికార్డింగ్‌ను ఎంచుకుని అవతలి వారికి ఆ వీడియోను సెండ్ చేయవచ్చు.
వీడియో మెసేజ్ రికార్డింగ్ సమయం దాదాపు 60 సెకన్లు(ఒక నిమిషం) ఉంటుందని ఒక నివేదిక పేర్కొంది. వాట్సాప్‌లో టెక్స్ట్ మెసేజ్‌లు, అటాచ్‌మెంట్‌లు, అలాగే వాయిస్, వీడియో కాల్‌ల మాదిరిగానే, కొత్త వీడియో మెసేజ్ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతాయని కంపెనీ పేర్కొంది. అన్ని టెస్టింగ్‌లు పూర్తయ్యాక వినియోగదారులందరికీ త్వరలో అందుబాటులోకి రానుంది.