Vivi V50e: బాబోయ్.. ఈ ఫీచర్లు పిచ్చెక్కిస్తున్నాయ్ ..వివో కొత్త స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ ధరలోనే
Vivi V50e: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు కంపెనీ అయిన వీవో బ్రాండ్ నుంచి ఏప్రిల్ లో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది.
దిశ, వెబ్ డెస్క్: Vivi V50e: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు కంపెనీ అయిన వీవో బ్రాండ్ నుంచి ఏప్రిల్ లో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. లాంఛ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కలర్ ఆప్షన్స్ తోపాటు కెమెరా ఫీచర్లకు సంబంధించిన వివరాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్లు కూడా రివీల్ చేసింది. వీవో వీ40ఈకి కొనసాగింపుగా వస్తున్నఈ వీవో వీ50ఈ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏప్రిల్ 10, మధ్యాహ్నం 12గంటలకు వీవో వీ50ఈ మోడల్ ను భారత మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఫ్లిక్ కార్ట్ తోపాటు, వీవో ఈ స్టోర్ లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వీవో వెబ్ సైట్లో ల్యాండింగ్ పేజీలో తెలిపిన వివరాలు పరిశీలిస్తే వీవో వీ 50ఈ రెండు కలర్స్ లో వస్తుంది. పెర్ల్ వైట్ తో పాటు సాఫైర్ బ్లూ రంగుల్లో విడుదల అవుతుంది. కాగా వీవో వీ50 ఫిబ్రవరిలో మార్కెట్లోకి లాంచ్ అయ్యింది.
ఇక ఈ ఫోన్ ఫీచర్లు చూసినట్లయితే ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రైమరీ సెన్సార్, ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ సెన్సార్, సర్కులర్ ఆరా లైట్ ఫీచర్ తో రానుంది. సెల్ఫీ కెమెరా కూడా 50మెగాపిక్సెల్ అని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు 4కే వీడియో రికార్డింగ్ ను సపోర్ట్ చేస్తాయని స్పష్టం చేసింది. క్వాడ్ కర్వ్డ్ డిస్ ప్లే 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది. 7.3 ఎంఎం థిక్ నెస్ తో స్లిమ్ గా కనిపిస్తుంది. ఐపీ68 రేటింగ్స్ తో డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఏఐ ఇమేజ్ ఎక్స్ పాండర్, ఏఐ నోట్ అసిస్ట్, సర్కిల్ టు సెరక్చ్, ఏఐ ట్రాన్ స్క్రిప్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కాగా ఈ మధ్య లీకైన సమాచారం మేరకు ఈ ఫోన్ ధర రూ. 25,000నుంచి రూ. 30,000 మధ్య ఉండే ఛాన్స్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ 5,600 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ 90వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 6.77 అంగుళాల 1.5కే డిస్ ప్లే ఉంటాయి.