Artificial Intelligence: ఆర్యభట్ట ఆధార్ కార్డు, పాన్ కార్డు చూశారా? ఆందోళనలో నెటిజన్లు!

'కాగల కార్యం గంధర్వులు తీర్చారు' అన్నది పాత సామెత.

Update: 2025-04-05 07:31 GMT
Artificial Intelligence: ఆర్యభట్ట ఆధార్ కార్డు, పాన్ కార్డు చూశారా?  ఆందోళనలో నెటిజన్లు!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: 'కాగల కార్యం గంధర్వులు తీర్చారు' అన్నది పాత సామెత. 'ఏ కార్యాన్నయినా టెక్నాలజీ ఇట్టే చేసేస్తుందన్నది' నేటి పద్ధతి. ప్రస్తుత రోజుల్లో ఎంత చిన్న పని చేయాలన్నా టెక్నాలజీ (Technology) ఉండాల్సిందే. ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) యుగం నడుస్తోంది. అన్ని రంగాల్లో దీని వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు, యూజర్ల కోసం ఆయా ఏఐ సంస్థలు రోజుకో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎక్స్ సంస్థకు చెందిన గ్రోక్ (Grok), ఓపెన్ఏఐ సంస్థకు చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) అనేక ఎడిటింగ్ ఫీచర్లును అందించాయి. ఇక నెటిజన్లు ఈ ఫీచర్లను ఓ రేంజ్‌లో వాడేస్తుండగా, అంతేస్థాయిలో భద్రతపరమైన సమస్యలనూ లేవనెత్తుతోంది.

ఎందుకంటే.. చాట్‌జీపీటీ, గ్రోక్‌లతో ఎడిట్ చేసిన ఫొటోలు, వీడియోలు అచ్చం ఒరిజినల్ మాదిరిగానే ఉంటున్నాయి. దీంతో సైబర్ నేరగాళ్లకు కూడా ఇదో వరంలా మారనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెలెబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎడిట్ చేసినవి ఇప్పటికే సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం. అయితే, తాజాగా మరో కొత్తరకమైన సమస్య కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఫొటోలు, వీడియోలనే క్రియేట్ చేసిన ఏఐ ఇప్పుడు ఏకంగా నకిలీ పత్రాలను కూడా సృష్టిస్తోంది. సాధారణంగా నకిలీ ప్రభుత్వ పత్రాలు సృష్టించాలంటే చాలా కష్టం. కానీ, అచ్చం ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన పత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఏఐ క్రియేట్ చేయటం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది.

తాజాగా యశ్వంత్ సాయి పాలఘాట్ అనే చాట్‌జీపీటీ యూజర్.. ఏదో ఒక నంబరుతో ఆర్యభట్ట ఆధార్ కార్డు, పాన్ కార్డు క్రియేట్ చేయమని అడిగాడు. వెంటనే చాట్‌జీపీటీ క్రియేట్ చేసి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ యూజర్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీని వల్ల సెక్యూరిటీ రిస్క్ చాలా ఉందని, దీనిని కొంత మేరకు నియంత్రించాలని పేర్కొన్నాడు. పికు అనే మరో యూజర్ కూడా ఈ విధమైన సమాచారాన్నే షేర్ చేశారు. తను పేరు, పుట్టిన తేదీ ఇచ్చి ఆధార్ కార్డు క్రియేట్ చేయమని అడుగగానే, క్షణాల్లో సృష్టించి ఇచ్చినట్లు తెలిపారు. ఆధార్, పాన్ కార్డ్ డేటాసెట్లను ఏఐ కంపెనీలకు అమ్మి అలాంటి నమూనాలను తయారు చేస్తోంది ఎవరు? ఫార్మాట్‌ను అంత కరెక్ట్‌గా అది ఎలా తెలుసుకోగలదు?' అంటూ ప్రశ్నించారు.

Tags:    

Similar News