ప్రధాని మోడీ నకిలీ ఓటర్ కార్డు.. ఇంతకీ ఎవరు క్రియేట్ చేశారంటే..?

చాట్‌జీపీటీ వినియోగంలోకి వచ్చిన తర్వాత కొన్ని జీవితాలు తలకిందులు అవుతున్నాయి.

Update: 2025-04-05 14:36 GMT
ప్రధాని మోడీ నకిలీ ఓటర్ కార్డు.. ఇంతకీ ఎవరు క్రియేట్ చేశారంటే..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: చాట్‌జీపీటీ వినియోగంలోకి వచ్చిన తర్వాత కొన్ని జీవితాలు తలకిందులు అవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు చాట్ జీపీటీని విచ్చల విడిగా వాడేస్తున్నారు. ఎన్నో సైబర్ మోసాలకు పాల్పడుతూ.. సామాన్యుల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాగే చదువుకున్న వారు సైతం సైబర్ నేరగాళ్లు చేతిలో చిక్కి.. జరిగిన మోసాన్ని బయట చెప్పుకోలేక నలిగిపోతున్నారు.

సైబర్ నేరగాళ్లు చేతిలో చాట్ జీపీటీ దుర్వినియోగానికి గురవుతోంది. తమకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. చాట్ జీపీటీతో ప్రభుత్వం జారీ చేసిన.. గుర్తింపు కార్డులను సైతం నకిలీ చేస్తున్నారు. రియలిస్టిక్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు,పాస్ పోర్టులు , ఓటర్ ఐడిలను క్రియేట్ చేసి.. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అయితే చాట్ జీపీటీతో క్రియేట్ చేసిన కార్డులు నకిలీవని గుర్తించడం చాలా కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ప్రధాని మోడీ నకిలీ ఓటర్ కార్డును కూడా చాట్ జీపీటీ క్రియేట్ చేసింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే సైబర్ నేరగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు

Tags:    

Similar News