గిబ్లీ ట్రెండ్ వైరల్ తర్వాత.. చాట్ జీపీటీకి ఎంత మంది యూజర్లు యాడ్ అయ్యారో తెలుసా..?

సోషల్ మీడియాలో గిబ్లీ ట్రెండ్ ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది

Update: 2025-04-05 12:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలో గిబ్లీ ట్రెండ్ ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్ లలో గిబ్లీ ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఓపెన్‌ చేసినా.. ఫీడ్‌ మొత్తం గిబ్లీ ఫొటోలతో నిండిపోతోంది. ఓపెన్ ఏఐ సంస్థ ఈ గిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి నెటిజన్లు ఈ ట్రెండ్ ను జోరుగా వాడేస్తున్నారు. చాట్ జీపీటీ లో తమ ఫోటోలను అప్ లోడ్ చేసి.. గిబ్లీ స్టైల్ ఫోటోలను క్రియేట్ చేసుకుంటున్నారు. నెటిజన్లకు నచ్చిన గిబ్లీ స్టైల్ ఫోటోలను వారి వారి సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లో షేర్ చేసి.. వైరల్ గా మార్చుకుంటున్నారు.

ఈ క్రమంలో చాట్ జీపీటీకి యూజర్ల సంఖ్య తెగ పెరిగిపోతోంది. అయితే గిబ్లీ స్టైల్ ట్రెండ్ వైరల్ అయిన తర్వాత.. 150 మిలియన్ల పైగా వినియోగదారులు యాడ్ అయ్యారని ఓపెన్ ఏఐ సంస్థ సిఈఓ శామ్ ఆల్ట్ మాన్ వెల్లడించారు. అలాగే ఒక గంటలో 10 లక్షల మంది యూజర్లు యాడ్ అయినట్టు పేర్కొన్నారు. ఈ గిబ్లీ ట్రెండ్ వల్ల చాట్ జీపీటీ అత్యధిక వృద్ధిని సాధించిందని తెలిపారు. అలాగే గిబ్లీ స్టైల్ ప్రారంభం ప్రారంభంతో పోలిస్తే.. ఇది రికార్డు స్థాయి పెరుగుదల అని వెల్లడించారు. ఈ ట్రెండ్ వారం వారానికి పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు.

Similar News