సాంకేతిక వైరస్‌లు, సహజ వైరస్‌ల మధ్య తేడా ఏమిటి ?
వైరస్ అంటే ఏమిటి ? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభం, కానీ కొంతమంది ఇప్పటికీ గందరగోళంలో ఉంటారు.
దిశ, ఫీచర్స్ : వైరస్ అంటే ఏమిటి ? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభం, కానీ కొంతమంది ఇప్పటికీ గందరగోళంలో ఉంటారు. వైరస్ అనేది రెండు రకాలు ఒకటి సాంకేతిక రంగానికి చెందిన వైరస్, మరొకటి సహజ వైరస్ లు. అయితే సాంకేతిక రంగానికి చెందిన వైరస్ కు, సహజ వైరస్ కి చాలా తేడాలు ఉన్నాయి. మరి ఆ తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కంప్యూటర్ వైరస్ అంటే ఏమిటి
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది హ్యాకర్లు ఉన్నారు. వారు ప్రమాదకరమైన వైరస్‌లను ఉపయోగించి వినియోగదారుల డేటా పై నిఘా ఉంచారు. ఈ రోజుల్లో CodeRed, MyDoom, iLoveU, CryptoLocker వంటి వైరస్‌లను ఉపయోగించి హ్యాకింగ్, సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
కంప్యూటర్ వైరస్ లు కంప్యూటర్ సిస్టమ్స్ లేదా ఇతర డిజిటల్ పరికరాలను ప్రభావితం చేసే ప్రోగ్రామ్‌లు. ఇవి సాధారణంగా మాల్వేర్ ఫైల్స్ లేదా సాఫ్ట్‌వేర్ ద్వారా వ్యాప్తి చెందుతాయి. కంప్యూటర్ వైరస్‌లు డేటాను పాడు చేయగలవు. సిస్టమ్‌ను నిలిపివేయగలవు. ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం లేదా సిస్టమ్ పై నియంత్రణ సాధించడం వంటి అనవసరమైన పనులను కూడా చేస్తుంది. కంప్యూటర్ వైరస్ ద్వారా సైబర్ నేరగాల్లు మీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
సహజ వైరస్ అంటే ఏమిటి..
సహజ వైరస్‌లు జీవ కణాలలో మాత్రమే పెరిగే జీవులు. ఇవి సోకిన వ్యక్తితో సంపర్కం ద్వారా వ్యాపిస్తాయి. ఈ సహజ వైరస్ లు మనిషిని అనారోగ్యం పాలు చేసి మరణించేలా చేస్తుంది. ఉదాహరణకు, COVID-19 వైరస్ అనేది సహజమైన వైరస్, ఇది చాలా మంది మరణాలకు కారణమైంది. అదేవిధంగా, నిపా, ఎబోలా, స్వైన్ ఫ్లూ సహజ వైరస్ వర్గంలోకి వస్తాయి.
కంప్యూటర్ వైరస్ లు, సహజ వైరస్ ల మధ్య తేడా..
కంప్యూటర్ వైరస్లు, సహజ వైరస్లు రెండూ హానికరం, కానీ వాటి మధ్య పెద్ద తేడాలు ఉన్నాయి. కంప్యూటర్ వైరస్‌లు ప్రోగ్రామ్‌ల రూపంలో ఉంటాయి. సహజ వైరస్‌లు జీవకణం రూపంలో ఉంటాయి. కంప్యూటర్ వైరస్‌లు సాధారణంగా డేటాను దెబ్బతీస్తాయి లేదా సిస్టమ్‌లను ఆపివేస్తాయి. అయితే సహజ వైరస్‌లు మనిషిని అనారోగ్యం పాలు చేసి, మరణానికి కారణమవుతాయి.
కంప్యూటర్ వైరస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి
యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి కంప్యూటర్ కు వైరస్ సోకకుండా చేయవచ్చు. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ మీ కంప్యూటర్‌ను వైరస్‌ల బారిన పడకుండా రక్షించడంలో సహాయపడుతుంది. జెన్యూన్ లింక్ ద్వారానే ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయాలి. లేదంటే వైరస్‌లు సిస్టమ్ ని హ్యాంగ్ చేస్తాయి. అలాగే మీ బ్రౌజర్ నుండి అనవసరమైన పాప్-అప్ ప్రకటనలను నిలిపివేయండి. మీ సిస్టమ్‌లోని భద్రతా సెట్టింగ్‌లను చెక్ చేసుకోండి. మీ సిస్టమ్ పాతదయ్యే కొద్ది ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు తరచుగా వైరస్ బగ్‌లను తొలగిస్తాయి. మీ కంప్యూటర్‌ను క్రమం తప్పకుండా బ్యాకప్ చేయండి. సిస్టమ్ కి పెట్టే పాస్ వర్డ్ పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, సంఖ్యలు,చిహ్నాలతో 12 అక్షరాలను కలిగి ఉండాలి. మీ ఇమెయిల్ ఖాతాను సురక్షితంగా ఉంచాలి. మీ కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తెలియని వెబ్‌సైట్‌లను సందర్శించవద్దు, అలాగే ప్రమాదకర లింక్‌లపై క్లిక్ చేయవద్దు.