పెద్ద బ్యాటరీతో ఎఫ్ సిరీస్‌లో శాంసంగ్ కొత్త ఫోన్ విడుదల
మూడు రంగుల్లో అందుబాటులో ఈ ఫోన్, పెద్ద బ్యాటరీ ద్వారా ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేసి రెండు రోజుల పాటు వాడుకోవచ్చని..
దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ శాంసంగ్ తన ఎఫ్ సిరీస్ పోర్ట్‌ఫోలియోలో కొత్త మబైల్‌ను సోమవారం మార్కెట్లో విడుదల చేసింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు పెద్ద బ్యాటరీతో పాటు సూపర్ అమోల్‌డ్ డిస్‌ప్లే కలిగిన ఎఫ్15 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. మూడు రంగుల్లో అందుబాటులో ఈ ఫోన్, పెద్ద బ్యాటరీ ద్వారా ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేసి రెండు రోజుల పాటు వాడుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఏ15 సిరీస్ ఫోన్‌కు రీబ్రాండెడ్‌లా వచ్చిన ఎఫ్15 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999 ఉంటుందని, 6జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 14,499గా నిర్ణయించామని కంపెనీ వివరించింది. సోమవారం నుంచే కంపెనీ అధికారిక స్టోర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయని శాంసంగ్ తెలిపింది. ఫీచర్లకు సంబంధించి ఆక్టాకోర్ మీడియాటెక్ డైమన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌తో వచ్చిన ఎఫ్15 స్మార్ట్‌ఫోన్ మైక్రో ఎస్‌డీ కార్డును 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు. బ్లూటూత్ 5.3, ఆండ్రాయిడ్ 14 ఎన్‌యూఐ5తో పనిచేస్తుంది. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, నాలుగేళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్టు కంపెనీ వెల్లడించింది. అయితే, పెద్ద బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ కోసం ఛార్జర్ అడాప్టర్‌ను వేరుగా కొనాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.