Xiaomi 15: షావోమీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చిన తొలి ఫోన్..!

చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ, షావోమీ(Xiaomi) కొత్త మొబైల్(New Mobile)ను లాంచ్ చేసింది.

Update: 2024-11-02 14:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ, షావోమీ(Xiaomi) కొత్త మొబైల్(New Mobile)ను లాంచ్ చేసింది. షావోమీ 15(Xiaomi 15) పేరుతో ఈ కొత్త 5జీ ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసింది. 12జీబీ ర్యామ్‌, 256 జీబీ వేరియంట్ ధర రూ. 52,000,16జీబీ ర్యామ్‌, 512 జీబీ వేరియంట్ ధర రూ. 58,000 గా కంపెనీ ఖరారు చేసింది. ఈ ఫోన్ అసకుసా గ్రీన్, బ్రైట్ సిల్వర్ ఎడిషన్, బ్లాక్, లిలాక్, వైట్ షేడ్స్ లో లభిస్తుంది. అయితే సేల్‌ ఎప్పటి నుంచి స్టార్ట్ అనే విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు అధికారంగా ప్రకటించలేదు.

షావోమీ 15  స్పెసిఫికేషన్స్ ..

  • 6.36 అంగుళాల 8టీ ఎల్టీపీఓ డిస్‌ప్లే
  • స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
  • ఆండ్రాయిడ్ 15 హైపర్ ఓఎస్ 2 ఆపరేటింగ్ సిస్టం
  • 120 HZ రిఫ్రెష్‌ రేట్
  • బ్యాక్ సైడ్ మూడు 50 మెగా పిక్సల్ కెమెరాలతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
  • 90 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5400 MAH బ్యాటరీని అందించారు.
Tags:    

Similar News