Realme GT 7 Pro: నవంబర్ 26న భారత మార్కెట్లో రియల్‌మీ నుంచి కొత్త మొబైల్ లాంచ్.. స్పెసిఫికేషన్స్ వివరాలివే..!
చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ(Realme) నుంచి త్వరలో కొత్త ఫోన్ భారత మార్కెట్లో విడుదల కాబోతుంది.
దిశ, వెబ్ డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ(Realme) నుంచి త్వరలో కొత్త ఫోన్ భారత మార్కెట్లో విడుదల కాబోతుంది. రియల్‌మీ జీటీ 7 ప్రో(Realme GT 7 Pro)పేరుతో దీన్ని లాంచ్ చేశారు. చైనాలో ఈ ఫోన్ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా.. మన దేశంలో నవంబర్ 26వ తేదీన లాంచ్ చేయనున్నారు. 12 జీబీ+256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.43,800గా కంపెనీ నిర్ణయించింది. వేరియంట్ బట్టి ధర రూ.56,900 వరకు ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెంట్(Dust, water Resistant)లో దీన్ని మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు. టైటానియం, లైట్ డొమైన్, వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ జీటీ 7 ప్రో ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు..
- 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే విత్ ఎకో2 ఓఎల్‌ఈడీ స్క్రీన్
- క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Qualcomm Snapdragon 8 Elite ) ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది.
- ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది.
- 120Hz రిఫ్రెష్ రేట్(120Hz Refresh Rate)
- ఇక బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్ కూడా ఉన్నాయి
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
- 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh కెపాసిటీ బ్యాటరీ కలిగి ఉంటుంది.