Asus Rog Phone 9: నవంబర్ 19న గ్లోబల్ మార్కెట్లో అసుస్ నుంచి కొత్త మొబైల్ లాంచ్.. స్పెసిఫికేషన్స్ వివరాలివే..!
తైవాన్(Tiwan)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ అసుస్(Asus) నుంచి నవంబర్ 19న కొత్త ఫోన్(New Phone) గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కాబోతుంది.
దిశ, వెబ్ డెస్క్: తైవాన్(Tiwan)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ అసుస్(Asus) నుంచి నవంబర్ 19న కొత్త ఫోన్(New Phone) గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కాబోతుంది. రోగ్ ఫోన్ 9(Rog Phone 9) పేరుతో దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ ఫోన్ భారత మార్కెట్(Indian Market)లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. అప్ గ్రేడెడ్ అనిమీ విజన్ ఫీచర్ తోపాటు ఏఐ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే దీని ధరను కంపెనీ అధికారంగా ప్రకటించలేదు. తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్(Specifications)ను సంస్థ ఆన్‌లైన్ లో రివీల్ చేసింది.
అసుస్ రోగ్ ఫోన్ 9 ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు..
- 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే విత్ ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్
- క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్(Qualcomm Snapdragon 8 Elite Chipset)తో ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది.
- 16 జీబీ ర్యామ్+512 జీబీ రోమ్(16GB RAM+512GB ROM)
- 185Hz రిఫ్రెష్ రేట్(185Hz Refresh Rate)
- ఇక బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ సోనీ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరా, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలను కలిగి ఉంది.
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
- 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5800mAh కెపాసిటీ బ్యాటరీ కలిగి ఉంటుంది.