Nothing OS: గూగుల్, యాపిల్ సంస్థలకు బిగ్ షాక్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు పోటీగా ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించనున్న నథింగ్..!

గత కొంతకాలంగా స్మార్ట్ ఫోన్ల(Smart Phones) మార్కెట్లో గూగుల్ ఆండ్రాయిడ్(Google Android) హవా ఎంతగా ఉందో చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-11-02 15:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొంతకాలంగా స్మార్ట్ ఫోన్ల(Smart Phones) మార్కెట్లో గూగుల్ ఆండ్రాయిడ్(Google Android) హవా ఎంతగా ఉందో చెప్పాల్సిన పని లేదు. అలాగే యాపిల్(Apple) సొంతగా ఐఓఎస్(IOS) అనే ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధి చేసుకుంది. అయితే వీటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు చైనా(China)కు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ 'నథింగ్(Nothing)' రెడీ అయ్యింది. త్వరలోనే సొంతంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్(OS)ను రూపొందించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నథింగ్ ఫౌండర్, వన్ ప్లస్ మాజీ సీఈఓ(Nothing Founder, One Plus Former CEO) కార్ల్ పై(Carl Pei) స్వయంగా వెల్లడించారు. టెక్ క్రంచ్(Tech Crunch) కంపెనీ నిర్వహించిన ఓ సదస్సు(Event)లో కార్ల్ పై మాట్లాడుతూ.. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని, దీంతో తాము అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వంటి ఫీచర్లను కూడా జోడిస్తామని, సొంత ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల యూజర్లకు మెరుగైన ఎక్స్ పీరియన్స్ అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. తమకు నిధుల కొరత ఉన్నప్పటికీ ఓఎస్ అభివృద్ధిపై సంస్థ పని చేయగలదన్నారు. 

Tags:    

Similar News