Samsung Galaxy S25 Edge: అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు.. ఈ ఫోన్‌ అదిరింది బాసూ!

Samsung Galaxy S25 Edge: శామ్సంగ్ స్లిమ్ ఫోన్ అంటే Samsung Galaxy S25 Edge గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

Update: 2025-04-08 11:21 GMT
Samsung Galaxy S25 Edge: అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు.. ఈ ఫోన్‌ అదిరింది బాసూ!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: Samsung Galaxy S25 Edge: శామ్సంగ్ స్లిమ్ ఫోన్ అంటే Samsung Galaxy S25 Edge గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శామ్‌సంగ్ ఈ ఫోన్‌ను టీజ్ చేసింది. ముందుగా కంపెనీ ఈ ఫోన్‌ను ఏప్రిల్ 15న లాంచ్ చేస్తుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజాగా లీకైన నివేదికలలో కొత్త లాంచ్ తేదీ వెల్లడైంది. సామ్‌మొబైల్ నివేదిక ప్రకారం, శామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను మే 13న లాంచ్ చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీకి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఏప్రిల్‌లో ప్రకటించిన లాంచ్ తేదీని మే వరకు ఎందుకు పొడిగించారో ప్రస్తుతానికి సమాచారం లేదు. పలు నివేదిలను బట్టి చూస్తే ..దీని వెనుక కారణం నాయకత్వ మార్పు కావచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను ప్రదర్శించింది. దీని కారణంగా దీని డిజైన్ లీక్ అయ్యింది.స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడుకుంటే.. ఈ ఫోన్ 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను చూడవచ్చు. ఇది 12GB RAM, 256GB, 512GB స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీని ప్రధాన లెన్స్ 200MP ఉండే అవకాశం ఉంది. ద్వితీయ కెమెరా 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌గా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 3900mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 25W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ 5.84mm మందం ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను Samsung Galaxy S25 Plus, Galaxy S25 Ultra మధ్య లాంచ్ చేయవచ్చు. లీకైన నివేదికల ప్రకారం, దీని ధర 1,249 యూరోలు (సుమారు $1385 / రూ. 1,17,680) ఉండే అవకాశం ఉంది. ఫోన్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. 

Tags:    

Similar News