Realme Air Conditioner :కేవలం 20 నిమిషాల్లో రూమ్‌ను కూల్ చేసే Realme కన్వర్టబుల్ AC

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Realme కొత్తగా టెక్‌లైఫ్ బ్రాండ్ పేరుతో గృహోపకరణాలపై దృష్టి పెడుతుంది

Update: 2023-01-24 10:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Realme కొత్తగా టెక్‌లైఫ్ బ్రాండ్ పేరుతో గృహోపకరణాలపై దృష్టి పెడుతుంది. ఇప్పుడు ఇండియాలో లేటెస్ట్ సాంకేతికతతో ఎయిర్ కండీషనర్(AC)ను మార్కెట్లోకి విడుదల చేసింది. వచ్చే వేసవి కాలానికి ముందుగా Realme 4 ఇన్ 1 కన్వర్టబుల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్(AC) ఇండియాలో అడుగుపెట్టింది. కొత్త AC రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇది 1 టన్ను, 1.5 టన్ను సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇది కొత్తగా ర్యాపిడ్ కూలింగ్ ఫీచర్‌తో వస్తుంది. దీని ద్వారా కేవలం 20 నిమిషాల్లో రూమ్‌ను చల్లగా మారుస్తుంది.


రూమ్‌లో ఉన్న వ్యక్తుల ఆధారంగా కూలింగ్ స్పీడ్ కంట్రోల్ అవుతుంది. ఇందుకోసం Flexi కంట్రోల్ టెక్నాలజీకి సపోర్ట్‌ను కలిగి ఉంది. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌తో కూడిన ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. దీని వలన కంప్రెసర్ ఎక్కువ కాలం పనిచేస్తుంది. రియల్‌మి ఇండియా సీఈవో, వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేత్ పేర్కొన్న వివరాల ప్రకారం.. వినియోగదారులకు అందుబాటు ధరలో కన్వర్టబుల్ AC ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. కొత్త AC 1 టన్ను మోడల్ ధర రూ. 28,499 నుండి ప్రారంభమవుతుంది. అదే 1.5 టన్ను వేరియంట్ ధర రూ. 33,999.

Tags:    

Similar News