అదిరిపోయే ఫీచర్స్‌తో OnePlus కొత్త స్మార్ట్ ఫోన్
OnePlus కంపెనీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి బుధవారం విడుదలైంది.
దిశ, వెబ్‌డెస్క్: OnePlus కంపెనీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి బుధవారం విడుదలైంది. దీని పేరు ‘OnePlus Nord 3’. 8GB RAM+128GB స్టోరేజ్ ధర రూ.33,999. 16GB RAM+256GB వేరియంట్ ధర రూ. 37,999. ఈ ఫోన్ జులై 15 నుంచి అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో HDR కంటెంట్‌తో పాటు స్క్రీన్‌కి HDR10+ సపోర్ట్ ఉందని OnePlus తెలిపింది.
OnePlus Nord 3 స్పెసిఫికేషన్లు
* 6.74-అంగుళాల AMOLED డిస్‌ప్లే.
* 40Hz - 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్.
* ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 9000 SoC ద్వారా పనిచేస్తుంది.
* Android 13-ఆధారిత OxygenOS 13 పై రన్ అవుతుంది.
* ఫోన్ బ్యాక్ సైడ్ 50MP+8MP+2MP కెమెరాలు.
* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.
* 80W SuperVOOC చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.
* ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇన్-డిస్‌ప్లేలో ఉంది.
* దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను కూడా అందించారు.