New Aadhaar App Launched: ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆధార్ కార్డుపై అదిరే అప్‌డేట్
New Aadhaar App Launched: ఆధార్ అనేది మనందరికీ ఆధారం వంటిది.

దిశ, వెబ్ డెస్క్: New Aadhaar App Launched: ఆధార్ అనేది మనందరికీ ఆధారం వంటిది. ఎక్కడైన ధ్రువీకరణ చూపేందుకు ఆధార్ కార్డునూ లేదంటే దాని జిరాక్స్ కాపినో తీసుకెళ్తుంటాం. ఇప్పుడు తెలంగాణలో బస్సుల్లో ప్రయాణం చేయాలంటే ఆధార్ కార్డు తప్పని సరి. ఇలా ఆర్థికలావాదేవీలు, బ్యాంకుల్లో ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఇక నుంచి మనం ఆధార్ కార్డు తీసుకెళ్లకుండానే ఉపకరించే కొత్త ఆధార్ యాప్ ను ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్ తో తక్షణ వెరిఫికేషన్, రియల్ టైం ఫేస్ ఐడెంటిఫికేషన్ వంటి ఫీచర్లు ఈ యాప్ లో ఉంటాయి. ధ్రువీకరణను పరిశీలించే చోట, ఆధార్ చెక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానిని మన ఆధార్ యాప్ తో స్కాన్ చేస్తే మన ఐడెంటిఫికేషన్ పూర్తి అవుతుంది.
ఇప్పుడు యూపీఐ చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినట్లే ఇదీ కూడా పూర్తి అవుతుంది. పూర్తి సురక్షితంగా, అత్యంత సులువుగా ఆధార్ తనిఖీ జరుగుతుందని సోషల్ మీడియా ఎక్స్ లో అశ్వినీ వైష్ణవ్ పోస్ట్ చేశారు. ఒక్కసారి బీటా పరీక్షలు పూర్తయితే దేశవ్యాప్తంగా ఈ యాప్ అమల్లోకి వస్తుంది. ప్రజలు తమ వ్యక్తిగత ఫోన్ ద్వారా తమ గుర్తింపును భద్రంగా పంచుకోవచ్చని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.