క్యూఆర్ కోడ్ స్కాన్‌తో విద్యుత్ బిల్లుల చెల్లింపులు

క్యూఆర్ కోడ్‌తో విద్యుత్ బిల్లులు చెల్లింపులను ఏపీ విద్యుత్ శాఖ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.

Update: 2025-04-08 13:43 GMT
క్యూఆర్ కోడ్ స్కాన్‌తో విద్యుత్ బిల్లుల చెల్లింపులు
  • whatsapp icon

దిశ,నెల్లూరు ప్రతినిధి : క్యూఆర్ కోడ్‌తో విద్యుత్ బిల్లులు చెల్లింపులను ఏపీ విద్యుత్ శాఖ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే, ఇతర ఆన్ లైన్ సర్వీసుల ద్వారా బిల్లుల చెల్లింపులు జరుగున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ వినియోగదారులకు తరచూ ఇబ్బందులు ఎదురు కావడంతోపాటు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నీటికి చెక్ పెట్టేలా విద్యుత్ శాఖ QR కోడ్ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. దీనిని మొదటిసారిగా నెల్లూరు పట్టణంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ వి.విజయన్ నెల్లూరు విద్యుత్ భవన్‌లో మంగళవారం విలేకరులకు వెల్లడించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులను సరళతరం చేయాలనే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్‌ను నెల్లూరు టౌన్‌లో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. త్వరలో జిల్లా అంత అంతటా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న తరుణంలో ఏపీఎస్పీడీసీయల్ ఈ ఇక్కట్లను చెక్ పెట్టేందుకు క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. మీకు ఇచ్చే బిల్లులో పొందుపరిచిన క్యూఆర్ కోడ్‌ను ఫోన్ పే, గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి నగదును చెల్లించే అవకాశం కల్పించామని తెలిపారు. బకాయిలు లేని వారికే ఈ తరహా బిల్లు ప్రస్తుతానికి జారీ అవుతుందని వెల్లడించారు.

విద్యుత్ అధికారులకు కీలక ఆదేశాలు

పెండింగ్ వ్యవసాయ సర్వీసులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ వి.విజయన్ ఆదేశించారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో పరికరాలు అందుబాటులో ఉన్నాయని వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరమ్మతులకు గురైన ట్రాన్స్ఫార్మర్లను వెంటనే మార్పు చేసి అందించాలన్నారు, అధికలోడ్ ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ లోడ్ పెంచాలని అధికారులకు సూచించారు. విద్యుత్ వినియోగదారుల ఫోన్లకు వెంటనే స్పందించాలని, 24 గంటలు అలెర్ట్‌గా ఉండాలని సిబ్బందిని అలర్ట్ చేశారు. విద్యుత్ సమస్యలపై వినియోగదారుల నుంచి ఎప్పుడు ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

50% రాయితీతో అదనపు లోడు క్రమబద్ధీకరణ :

పరిమితికి మించి విద్యుత్ లోడ్ వాడకంతో తరచూ గృహ వినియోగదారులు ఓల్టేజ్ సమస్యలతో సతమతమవుతున్నారు. తక్కువలోడుతో కనెక్షన్ తీసుకొని అధిక సంఖ్యలో విద్యుత్ ఉపకరణాల వినియోగం వల్ల లోడ్ పెరిగి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం క్రమబద్దీకరణకు గతంలో చెల్లిస్తున్న ధరలో సగం రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 50% రాయితీ క్రమబద్ధీకరణకు జూన్ 30 వరకు గడువుంది. రాయితీ ధరపై లోడ్ ను క్రమబద్ధీకరించుకునేందుకు మీ సేవ కేంద్రాలతో పాటు విద్యుత్ శాఖ వెబ్ సైట్ లో (apspdcl. in)నేరుగా చెల్లించవచ్చు.

Tags:    

Similar News