UPI: భారీ కాదు.. అతి భారీ షాక్.. ఏప్రిల్‌ 1 నుంచి మీ UPI సేవలు పనిచేయకపోవచ్చు!

From April 1 Google Pay Phonepe Paytm UPI will not work on Jio Airtel BSNL, and inactive numbers telugu news

Update: 2025-03-20 04:59 GMT
UPI: భారీ కాదు.. అతి భారీ షాక్.. ఏప్రిల్‌ 1 నుంచి మీ UPI సేవలు పనిచేయకపోవచ్చు!
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: UPI services Close: నేటికాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. స్మార్ట్ పోన్ ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. చిన్న మొత్తం నుంచి పెద్దమొత్తం వరకు యూపీఐ(UPI) ద్వారానే ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు. గూగుల్ పే(Google pay), పేటీఎం(Paytm), ఫోన్ పే(Phonepay), వంటి యాప్స్ సహాయంతో డిటిజల్ పేమెంట్స్ చేస్తున్నారు. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( NPCI)కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకులు డిస్ కనెక్ట్ చేసిన..లేదంటే సరెండర్ చేసిన మొబైల్ నెంబర్స్ ను మార్చి 31 వరకు తొలగించాలని యాప్స్ ను ఆదేశించింది.

నిజానికి ఒక మొబైల్ నెంబర్ ను వరుసగా 90రోజులపాటు వాయిస్ కాల్స్, sms..కనీసం డేటా కోసం ఉపయోగించకపోయినా..ఆ నెంబర్ ను మొబైల్ కంపెనీలు డియాక్టివ్ చేసేస్తాయి. ఆయా నెంబర్లను ఇతరులకు కేటాయిస్తుంటాయి. అలాంటి నెంబర్స్ వారుడుతున్నవారంతా బ్యాంక్, ఇతర ట్రాన్సాక్షన్స్ కోసం లింక్ చేసిన సమయంలో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలోనే అలాంటి బ్యాంకు అకౌంట్స్ ను తొలగించే పని ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ప్రతివారం జరుగుతుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. మార్గదర్శకాల మేరకు బ్యాంకులు డియాక్టివేట్ అయినా..సరెండర్ చేసిన నెంబర్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ జాబితాను క్రమం తప్పకుండా అప్ డేట్ చేయాల్సిందేనని ఎన్ పీసీఐ స్పష్టం చేసింది.

కాగా గత ఏడాది జులై 16న స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్యాంకులు మొబైల్ నెంబర్స్ గురించి తెలుసుకునేందుకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. మార్చి 31 నాటికి బ్యాంకులతో పాటు యూపీఐ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా మార్గదర్శకాలను పాటించాల్సిందేనని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వివరణాత్మక నివేదికలు పంచుకోవాల్సిందేనని తెలిపింది.

ఇక అప్ డేట్ చేసిన మొబైల్ నెంబర్ సిస్టమ్ ను ఉపయోగించి..నిర్వహించిన లావాదేవీల సంఖ్యను పేర్కొనాలని తెలిపింది. ఎన్ పీసీఐ చర్యతో సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. నిజానికి యూపీఐ కోసం మొబైల్ నెంబర్ తప్పనిసరి. గతంలో యూపీఐకి లింక్ చేసిన నెంబర్లను ఉపయోగించి ప్రస్తుతం చాలా మంది ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి అలా చేయడం ఇక కదరదు. తప్పనిసరిగా యాక్టివ్ లో ఉన్న నెంబర్ మాత్రమే బ్యాంకులు పరిగణలోనికి తీసుకుంటాయి. యాక్టివ్ లో లేని నెంబర్స్ యూపీఐలను డీయాక్టివేట్ చేస్తాయి. మీకు తప్పనిసరిగా యూపీఐ సేవలు కావాలనుకుంటే ఆయా మొబైల్ నెంబర్లను తప్పనిసరిగా రీచార్జ్ చేయాల్సిందే. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.

Tags:    

Similar News