ఉత్కంఠ పోరులో ఇండియా విన్

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌-ఆసీస్ మూడు వన్డేలా సిరీస్‌‌ను 2-1 ఆధీక్యంతో ఆసీస్ కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. తొలి వన్డే మ్యాచ్‌లో 66 పరుగులు, రెండో మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్ చేజారిపోయింది. మూడో వన్డే సాగిందిలా.. ఇక 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లకు భారత బౌలర్లు కళ్లెం […]

Update: 2020-12-02 06:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌-ఆసీస్ మూడు వన్డేలా సిరీస్‌‌ను 2-1 ఆధీక్యంతో ఆసీస్ కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. తొలి వన్డే మ్యాచ్‌లో 66 పరుగులు, రెండో మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్ చేజారిపోయింది.

మూడో వన్డే సాగిందిలా..

ఇక 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆటగాళ్లకు భారత బౌలర్లు కళ్లెం వేశారు. కీలక సమయాల్లో వికెట్లను తీసుకొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలుత ఓపెనింగ్ వచ్చిన మార్నస్‌ (7) పరుగులకే వెనుదిరిగాడు. యువ బౌలర్ నటరాజన్ క్లీన్ బోల్డ్ చేశాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ క్రీజులో కుదురుకొని (75) పరుగులు చేశాడు. ఇదే సమయంలో వన్‌డౌన్‌లో వచ్చి స్మిత్ 7 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఫించ్‌కు సరైన భాగస్వామ్యం లభించలేదు. హెన్రిక్స్ కూడా (22) పరుగులకే వికెట్ కోల్పోయాడు. భారత బౌలర్లు బంతికి పని చెప్పడంతో ఫించ్‌ 123 స్కోర్ బోర్డు వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో ఆసీస్ 4 వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాతి స్థానాల్లో క్రీజులోకి వచ్చిన అలెక్స్ కారీ (38), గ్లెన్ మ్యాక్స్‌వెల్(59) పరుగులు చేసి టీమిండియాను కాస్త టెన్షన్ పెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో అలెక్స్ కారీ రనౌట్ అవగా.. 59 పరుగులతో ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్‌ను బుమ్రా క్లీన్ బోల్డ్ చేశాడు. దీంతో భారత విజయానికి పునాదులు పడినట్టు అయింది. ఇక ఇదే జోరును కొనసాగించిన భారత బౌలర్లు ఆ తర్వాత వచ్చిన అస్టన్ అగర్‌ను‌(28), సీన్ అబోట్(4), ఆడం జంపాను (4) పరుగులకే కట్టడి చేశారు. దీంతో 49.3 ఓవర్లలో 289 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 13 పరుగులతో విజయం సాధించింది.

ఇండియా ఇన్నింగ్స్:

తొలుత బ్యాటింగ్ దిగిన ఇండియా జట్టు 302 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్లు ధావన్(16), శుబ్‌మన్ గిల్(33) పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ (63)పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్‌(19), కేఎల్ రాహుల్(5) పరుగులు రాబట్టడంలో విఫలం అయ్యారు. దీంతో 152 పరుగులకే టీమిండియా 5 వికెట్లను కోల్పోయింది.

ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టుకు అండగా నిలిచారు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి నిలకడగా రాణిస్తూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. మొత్తం 76 బంతులను ఫేస్ చేసిన పాండ్యా 7 ఫోర్లు, 1 సిక్సర్ బాది (92) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాండ్యాకు తోడు రవీంద్ర జడేజా 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాది (66) పరుగులతో చివరి వరకు రాణించాడు. దీంతో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 302 పరుగులు చేసింది.

Tags:    

Similar News