టీమ్ ఇండియా కరోనా నెగెటివ్

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో పలువురు క్రికెటర్లు బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో టీమ్ ఇండియా సభ్యులందరికీ కోవిడ్ టెస్టులు నిర్వమించారు. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగెటివ్ వచ్చినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాము.. ఎవరికీ ఎలాంటి అపాయం లేదు అని పేర్కొన్నది. కేవలం క్రికెటర్లకే కాకుండా సహాయక సిబ్బందికి కూడా ఈ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు టీమ్ ఇండియా మెల్‌బోర్న్ వదలి సిడ్నీకి పయనం […]

Update: 2021-01-04 09:55 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో పలువురు క్రికెటర్లు బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో టీమ్ ఇండియా సభ్యులందరికీ కోవిడ్ టెస్టులు నిర్వమించారు. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగెటివ్ వచ్చినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాము.. ఎవరికీ ఎలాంటి అపాయం లేదు అని పేర్కొన్నది. కేవలం క్రికెటర్లకే కాకుండా సహాయక సిబ్బందికి కూడా ఈ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు టీమ్ ఇండియా మెల్‌బోర్న్ వదలి సిడ్నీకి పయనం అయ్యింది. ఈ నెల 7 నుంచి కీలకమైన మూడో టెస్టు ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Tags:    

Similar News