టీచర్లు చీరలు మాత్రమే కట్టుకోవాలి.. మీకేం హక్కు ఉందంటూ మంత్రి సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: చీరకట్టు భారతదేశ మహిళల సంప్రదాయానికి ఓ సూచిక. నార్త్ టు సౌత్ వరకు చీరకట్టు అనాదిగా వస్తోంది. కానీ, ప్రస్తుత ఆధునిక సమాజంలో చీరలతో పాటు మోడ్రన్ డ్రెస్సులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇదే విషయంపై కేరళలో తీవ్ర చర్చ నడుస్తోంది. విద్యా సంస్థల్లో టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న మహిళలు చీరలను తప్పనిసరిగా కట్టుకోవాలంటూ ఆయా యజమాన్యాలు ఒత్తిడి చేస్తోన్న వ్యవహారం వివాదాస్పదం అయింది. దీంతో టీచర్ల సంఘాలు కేరళ విద్యా శాఖ […]
దిశ, వెబ్‌డెస్క్: చీరకట్టు భారతదేశ మహిళల సంప్రదాయానికి ఓ సూచిక. నార్త్ టు సౌత్ వరకు చీరకట్టు అనాదిగా వస్తోంది. కానీ, ప్రస్తుత ఆధునిక సమాజంలో చీరలతో పాటు మోడ్రన్ డ్రెస్సులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇదే విషయంపై కేరళలో తీవ్ర చర్చ నడుస్తోంది. విద్యా సంస్థల్లో టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న మహిళలు చీరలను తప్పనిసరిగా కట్టుకోవాలంటూ ఆయా యజమాన్యాలు ఒత్తిడి చేస్తోన్న వ్యవహారం వివాదాస్పదం అయింది.
దీంతో టీచర్ల సంఘాలు కేరళ విద్యా శాఖ మంత్రి బిందుకు ఫిర్యాదు చేయగా.. ఆమె విద్యా సంస్థల యాజమాన్యాలకు ఘాటు సమాధానం ఇచ్చారు. మహిళల లైఫ్ స్టైల్ వారి పర్సనల్ అని.. వారి వ్యక్తిగత విధానంలో విద్యా సంస్థల యాజమాన్యాల జోక్యం ఏంటని సీరియస్ అయ్యారు. స్కూల్‌కి చుడిదార్‌లో వస్తే సమస్య ఏంటన్నారు. మరొకరి డ్రెస్సింగ్ విధానంపై కండీషన్స్ పెట్టడం సరికాదని.. చీర కట్టుకోవడం విద్యా సంస్థల్లో తప్పనిసరి కాదంటూ ఆదేశాలు జారీ చేశారు.