మహిళను వేధించిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్…
మహిళను వేధించిన కేసులో ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఈ నెల 2వ తేదీన లలిత అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆగ్రహంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో ఘటనా స్థలానికి వచ్చి ఆందోళన కారులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. […]
మహిళను వేధించిన కేసులో ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేక ఈ నెల 2వ తేదీన లలిత అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కీచక ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆగ్రహంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో ఘటనా స్థలానికి వచ్చి ఆందోళన కారులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.