ప్రైవేట్ క్లాస్ అని పిలిచి బాలికలపై టీచర్ అత్యాచారం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకు కామాంధులు చేసే ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. చిన్నాపెద్ద అని తేడాలేదు, వావివరుస పట్టింపులేదు.. ఎదురుగా ఉన్నది అమ్మాయి అయితే చాలు అత్యాచారానికి పాల్పడుతూ వారి కామకోరికలను తీర్చుకుంటున్నారు. ఇక ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే.. ఈ కామాంధులు బాధ్యతగల వృత్తిలో ఉండడం. పోలీసులు, డాక్టర్లు, టీచర్లు ఇలా బాధ్యాతయుతమైన వృత్తిలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు కామాంధులుగా మారి మహిళలను హింసిస్తున్నారు. గత ఏడాది ఖమ్మంలో ఒక టీచర్ పాఠాలు చెప్తానని […]
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకు కామాంధులు చేసే ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. చిన్నాపెద్ద అని తేడాలేదు, వావివరుస పట్టింపులేదు.. ఎదురుగా ఉన్నది అమ్మాయి అయితే చాలు అత్యాచారానికి పాల్పడుతూ వారి కామకోరికలను తీర్చుకుంటున్నారు. ఇక ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే.. ఈ కామాంధులు బాధ్యతగల వృత్తిలో ఉండడం. పోలీసులు, డాక్టర్లు, టీచర్లు ఇలా బాధ్యాతయుతమైన వృత్తిలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు కామాంధులుగా మారి మహిళలను హింసిస్తున్నారు. గత ఏడాది ఖమ్మంలో ఒక టీచర్ పాఠాలు చెప్తానని స్కూల్ కి పిలిచి ఐదుగురు బాలికలపై అత్యాచారం చేసిన ఘటన తెలిసిందే. బాలికల ఫిర్యాదుమేరకు పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఇక తాజాగా ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టి టీచర్ కి కఠిన శిక్షను విధించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో దొడ్డా సునీల్ కుమార్ (40) సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కరోనా గతేడాది డిసెంబర్ లో కరోనా కారణంగా స్కూల్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రైవేట్ క్లాస్ లు చెప్తానని ఐదుగురు విద్యార్థులను స్కూల్ కి రప్పించి, వారిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఇక ఇదే విషయాన్నీ బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు టీచర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక ఈ కేసుపై వాదోపవాదనలు విన్న పోక్సో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం సంచలనం తీర్పు ఇచ్చారు. బాలికలపై అత్యాచారం చేసిన టీచర్ సునీల్ కుమార్ ను దోషిగా నిర్దారించి అతనికి 21 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 11 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.