హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు

దిశ వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన నిరసన విరమించారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో 9 గంటలపాటు నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు స్వచ్ఛందంగా హైదరాబాద్ కి తిరుగు పయనమయ్యారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  ఇదిలా ఉంటే వీఐపీ లాంజ్ లో నిరసన చేపట్టిన చంద్రబాబును విమానాశ్రయం నుంచి బలవంతంగా హైదరాబాద్ కి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ట్రూజెట్, ఇండిగో, స్పైస్ జెట్ విమానాల్లో చంద్రబాబుకు […]

Update: 2021-03-01 08:29 GMT

దిశ వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన నిరసన విరమించారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో 9 గంటలపాటు నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు స్వచ్ఛందంగా హైదరాబాద్ కి తిరుగు పయనమయ్యారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే వీఐపీ లాంజ్ లో నిరసన చేపట్టిన చంద్రబాబును విమానాశ్రయం నుంచి బలవంతంగా హైదరాబాద్ కి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ట్రూజెట్, ఇండిగో, స్పైస్ జెట్ విమానాల్లో చంద్రబాబుకు టికెట్లు బుక్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం వెళ్లలేదు. చివరికి శాంతించిన చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛందంగా హైదరాబాద్ బయలుదేరారు.

ఇకపోతే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా దాడులు చేస్తుందని ఆరోపిస్తూ..చంద్రబాబు నాయుడు నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన్ను పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. పర్యటనకు అనుమతి లేదంటూ..వీఐపీ లాంజ్ లో నిర్భందించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు

Tags:    

Similar News