ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ
దిశ, ఏపీ బ్యూరో: వరదలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు లంక గ్రామాలు నీట మునిగిపోయి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కొండవీడు వాగు ఉధృతగా ప్రవహిస్తోంది. కరకట్టకు సమీపంలోని పంటలు నీట మునిగిపోయాయి. మత్య్సకారులు వేటకు వెళ్లే ప్రాంతం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అధికారులకు సమాచారం ఇచ్చినా […]
దిశ, ఏపీ బ్యూరో: వరదలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు లంక గ్రామాలు నీట మునిగిపోయి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కొండవీడు వాగు ఉధృతగా ప్రవహిస్తోంది. కరకట్టకు సమీపంలోని పంటలు నీట మునిగిపోయాయి. మత్య్సకారులు వేటకు వెళ్లే ప్రాంతం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని ప్రజలు అంటున్నారు. వరద ఉధృతి మరింత పెరిగిందని చెబుతున్నారు. రైతులకు సాయంపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆయన పేర్కొన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణ పరిహారం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.