తపస్వి అంతిమ యాత్రలో Varla Ramaiah
ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన వైద్య విద్యార్ధిని తపస్వి అంత్యక్రియలు గురువారం జరిగాయి. తపస్వి అంతిమయాత్రలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ, పామర్రు టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన వైద్య విద్యార్ధిని తపస్వి అంత్యక్రియలు గురువారం జరిగాయి. తపస్వి అంతిమయాత్రలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ, పామర్రు టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో లేక, కొన్నిసార్లు అదే టెక్నాలజీ వెర్రితలలు వేసి కొందరి ప్రాణాలు తీస్తున్నందుకు బాధపడాలో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. టెక్నాలజీని ఉపయోగించి, యువతుల్ని మభ్యపరిచి, వారిని ట్రాప్ చేసి, బంగారు జీవితాలను నాశనం చేస్తున్న ప్రేమోన్మాదుల అఘాయిత్యాలకు ఈ ప్రభుత్వంలో అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. మొన్నటి రమ్య ఉదంతం నుంచి నిన్నటి తపస్వి హత్య వరకు ఇదే పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో యువతుల్ని ట్రాప్ చేసి, తరువాత ఒప్పుకోలేదని నిర్దాక్ష్యణ్యంగా వారి ప్రాణాలు బలిగొంటున్నారని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభధ్రతలు క్షీణించి, అరాచకశక్తుల్ని అదుపు చేయలేని దుస్థితిలో రాష్ట్ర పోలీస్ శాఖ ఉందని వర్ల రామయ్య ఆరోపించారు. నిర్వీర్యమైన హోంశాఖ, అధికారం చేపట్టి మూడున్నరేళ్లైనా శాంతి భద్రతల్ని సమీక్షించలేని బలహీన ముఖ్యమంత్రిని చూశాక, ఇక రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని గగ్గోలు పెట్టడం అర్థవంతమేనని చెప్పారు. తపస్వి కేసులో దుండగుడు ప్రేమ పేరుతో సదరు యువతి వెంటపడి వేధిస్తుంటే, బాధితులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆనాడే ఈ ప్రేమోన్మాదిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ ఘటన జరిగేదికాదని.. తపస్వి బలయ్యేది కాదని వ్యాఖ్యానించారు. పోలీసుల ప్రధాన విద్యుక్తధర్మం మరిచి, ముఖ్యమంత్రికి పరదాలు కట్టడంలో, ఆయన సభలకు బారికేడ్లు ఏర్పాటు చేయడంలో, ప్రత్యర్థుల్ని వేధించడంలో, ప్రశ్నించే గొంతుకలను నొక్కడంలో నిమగ్నమై శాంతిభద్రతల్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి శాంతిభద్రతలు సమీక్షించి, మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
READ MORE