‘తాటాకు చప్పుళ్లకు బెదరను’

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు తాను బెదిరేది లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యనమల రామకృష్ణుడును విమర్శించే అర్హత బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి లేదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిపినందుకే వైసీపీ ప్రభుత్వం, స్పెషల్ ఛీప్ సెక్రటరీ జవహరెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డితో తనకు నోటీసులు జారీ చేయించారన్నారు. సాక్ష్యాలు, ఆధారాలతో […]

Update: 2020-07-19 05:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు తాను బెదిరేది లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యనమల రామకృష్ణుడును విమర్శించే అర్హత బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి లేదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిపినందుకే వైసీపీ ప్రభుత్వం, స్పెషల్ ఛీప్ సెక్రటరీ జవహరెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డితో తనకు నోటీసులు జారీ చేయించారన్నారు. సాక్ష్యాలు, ఆధారాలతో సహా 108, 104 అంబులెన్స్ లకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచినట్లు తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని నోటీసులిచ్చారని పట్టాభిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News