మారిన ప్రతిసారి మార్చితే విచ్ఛిన్నమే: లోకేశ్

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు నారా లోకేశ్. పాలకులు మారిన ప్రతిసారి రాజధానులను మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్ఛినం అని విమర్శించారు. జగన్ మూడు రాజధానుల ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. రాజధాని ముక్కలాటతో ఇప్పటికే 85 మంది రైతులను బలి తీసుకున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులు చేస్తున్న నిరసనలు నేటితో 250 రోజులకు చేరుకుందని.. ఇప్పటికైనా మించిపోయింది లేదని రాజధానిగా అమరావతిని […]

Update: 2020-08-23 01:29 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు నారా లోకేశ్. పాలకులు మారిన ప్రతిసారి రాజధానులను మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్ఛినం అని విమర్శించారు. జగన్ మూడు రాజధానుల ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. రాజధాని ముక్కలాటతో ఇప్పటికే 85 మంది రైతులను బలి తీసుకున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని రైతులు చేస్తున్న నిరసనలు నేటితో 250 రోజులకు చేరుకుందని.. ఇప్పటికైనా మించిపోయింది లేదని రాజధానిగా అమరావతిని కొనసాగించి అభివృద్ధి వికేంద్రీకరణకు కృషి చేయాలని సీఎం జగన్‌కు హితవు పలుకుతూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News