కర్నూలులో హైకోర్టుతో 10మందికైనా ఉద్యోగాలొస్తయా !
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఫైర్ అయ్యారు. జగన్.. సంపద దోచుకోవడం కోసం.. సంపద సృష్టించే అమరావతి బ్రాండ్‌కి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే 13జిల్లాలకు సంపద సృష్టి కేంద్రంగా మారుతుందని, మారుమూల గ్రామాల్లోని యువతికి కూడా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల టౌన్‌లోని 10మందికైనా ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మూడు రాజధానులను ఏర్పాటు […]
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఫైర్ అయ్యారు. జగన్.. సంపద దోచుకోవడం కోసం.. సంపద సృష్టించే అమరావతి బ్రాండ్‌కి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే 13జిల్లాలకు సంపద సృష్టి కేంద్రంగా మారుతుందని, మారుమూల గ్రామాల్లోని యువతికి కూడా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల టౌన్‌లోని 10మందికైనా ఉద్యోగాలు వస్తాయా అని ప్రశ్నించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.