వాళ్లే మా దేవుళ్లు… జేసీ ప్రభాకర్ భావోద్వేగం
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జేసీ బ్రదర్స్ ఏం చేసినా..ఏం మాట్లాడినా సంచలనమే. అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తాము 1952 నుంచి ఏకధాటిగా రాజకీయాలు చేస్తున్నామని అందుకు తమ గ్రామ ప్రజలే కారణమని అన్నారు. తమ ఊరే తమకు ఇంతటి పేరు తీసుకువచ్చిందని ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. వాళ్లకు సేవ చేసేందుకే తాము పుట్టామని చెప్పుకొచ్చారు. ఇకపోతే తాడిపత్రి ప్రజలు […]
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జేసీ బ్రదర్స్ ఏం చేసినా..ఏం మాట్లాడినా సంచలనమే. అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తాము 1952 నుంచి ఏకధాటిగా రాజకీయాలు చేస్తున్నామని అందుకు తమ గ్రామ ప్రజలే కారణమని అన్నారు. తమ ఊరే తమకు ఇంతటి పేరు తీసుకువచ్చిందని ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. వాళ్లకు సేవ చేసేందుకే తాము పుట్టామని చెప్పుకొచ్చారు. ఇకపోతే తాడిపత్రి ప్రజలు రావాలి ప్రభాకర్.. కావాలి ప్రభాకర్ అని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజల ఆదరణ చూస్తుంటే తమకే భయమేస్తోందన్నారు. ప్రజల అభిమానం అలా ఉందని చెప్పుకొచ్చారు.
ఓ ప్రముఖ చానెల్ తో మాట్లాడిన ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారు ఎదుర్కొంటున్న బాధలను ప్రజలు తమతో పంచుకున్నారన్నారు. మున్సిపాలిటీలో మంచి వాతావరణాన్ని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆనాడు ‘రావాలి జగన్ .. కావాలి జగన్’ అన్నారని.. ఈసారి ఆ గాలి తమ వైపు వీస్తుందన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. మున్సిపాలిటీలో కచ్చితంగా తాము వస్తామన్నారు. ప్రజలు నమ్మకంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే ఎక్కువ స్థానాలు తన నియోజకవర్గంలోనే వచ్చాయన్నారు. ప్రజలను తమ ఆత్మీయ బంధువులుగా అనుకుంటున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.