అఖిలప్రియకు 14రోజుల రిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీమంత్రి అఖిలప్రియను పోలీసులు బుధవారం రాత్రి జడ్జి ఎదుట హాజరుపరచగా 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు భూమా అఖిలప్రియను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం ఉదయం చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లనున్నారు. అఖిలప్రియకు ఆరోగ్యం సరిగా లేదని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలను కోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు గాంధీ ఆస్పత్రిలో అఖిలప్రియకు […]
దిశ, వెబ్‌డెస్క్: కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత, మాజీమంత్రి అఖిలప్రియను పోలీసులు బుధవారం రాత్రి జడ్జి ఎదుట హాజరుపరచగా 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు భూమా అఖిలప్రియను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం ఉదయం చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లనున్నారు. అఖిలప్రియకు ఆరోగ్యం సరిగా లేదని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలను కోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు గాంధీ ఆస్పత్రిలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో కళ్లు తిరిగి పడిపోగా.. వైద్య సిబ్బంది సైలెన్ ఎక్కించారు. అనంతరం సికింద్రాబాద్‌కు తరలించి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా ఈనెల 20వరకు రిమాండ్ విధించారు.