ఏసీబీకి టీడీపీ ఫిర్యాదు.. ఎందుకంటే !

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, వెంటనే విచారణ జరపాలని కోరుతూ టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, గొట్టిపాటి రామకృష్ణ సోమవారం ఏసీబీ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో కొందరు దళారులు కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, రూ.700 కోట్లకుపైగా దళారులు జేబులు నింపుకున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు.. రైతు దగా కేంద్రాలుగా మారాయని, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకల్లో వైసీపీ ఎమ్మెల్యే పాత్ర ఉందని […]

Update: 2020-11-02 06:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, వెంటనే విచారణ జరపాలని కోరుతూ టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, గొట్టిపాటి రామకృష్ణ సోమవారం ఏసీబీ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో కొందరు దళారులు కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, రూ.700 కోట్లకుపైగా దళారులు జేబులు నింపుకున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు.. రైతు దగా కేంద్రాలుగా మారాయని, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకల్లో వైసీపీ ఎమ్మెల్యే పాత్ర ఉందని బుద్దా వెంకన్న, అశోక్‌బాబు ఆరోపించారు. దళారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News