YS Vivekananda Reddy : వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కీలక మలుపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో మళ్ళీ తెరపైకి వచ్చింది.

Update: 2024-11-18 16:28 GMT
YS Vivekananda Reddy : వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కీలక మలుపు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో మళ్ళీ తెరపైకి వచ్చింది. వివేకానంద పీఏ కృష్ణారెడ్డి.. 2022లో వివేకా కుమార్తె సునీత(YS Sunitha), ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా సోమవారం పోలీసు విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు పులివెందుల డిఎస్పీ మురళి నాయక్ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను విచారించారు. న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డి నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసులో ఫైనల్ ఛార్జీషీట్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇటీవలే వైఎస్ సునీత సీఎం చంద్రబాబు(CM Chandrababu Nayudu), హోం మంత్రి అనితను కలిసి ఈ విషయంపై చర్చించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట జిల్లా ఎస్పీని కూడా ఆమె కలిశారు. తాజాగా ఇందులోని పూర్వాపరాలు తెలుసుకునేందుకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags:    

Similar News