Pawan Kalyan: తొలి సమావేశంలోనే టీటీడీ కీలక నిర్ణయం.. స్పందించిన పవన్ కల్యాణ్
తిరుపతి(Tirupati) ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తూ (TTD) పాలక మండలి తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి(Tirupati) ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తూ (TTD) పాలక మండలి తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆ నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. తాను కూడా కూటమి ప్రభుత్వంలో తప్పకుండా దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.
నగర ప్రజల ఆకాంక్షను టీటీడీ చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లి పరిశీలించాలని సూచించాను. టీటీడీ తొలి సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నందుకు చైర్మన్ బీఆర్ నాయుడుకు, పాలక మండలి సభ్యులకు, ఈవో శ్యామల రావుకు అభినందనలు తెలిపారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు.
తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనంపై టి.టి.డి నిర్ణయం హర్షణీయం - ఆంధ్రపదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు#TTD pic.twitter.com/EY9Vad4qLZ
— JanaSena Party (@JanaSenaParty) November 18, 2024