బోరుగడ్డ అనిల్‌కు బిగ్ షాక్.. జ్వరం ఉన్నా అక్కడికి వెళ్లాల్సిందేనని కోర్టు ఆదేశం
వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు మంగళగిరి కోర్టు షాక్ ఇచ్చింది..
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు మంగళగిరి కోర్టు షాక్ ఇచ్చింది. బీజేపీ నేతలపై దాడి కేసులో పోలీసు కస్డడీ అనుమతించింది. జ్వరం ఉందని, కస్టడీ విచారణకు హాజరుకాలేనని తెలిపినా వెళ్లాల్సిందేనని ఆదేశించింది. ఇప్పటికే పలు కేసుల్లో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‌ను విచారించేందుకు మంగళగిరి పోలీసులు మంగళవారం అన్ని ఏర్పాట్లు చేశారు.
కాగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులకు మద్దతు తెలిపి వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలపై బోరు గడ్డ అనిల్, అతని అనుచరులు, పలువురు వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదు అయినా ముందుకు కదల్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసులను బయటకు తీశారు. దీంతో ఈ కేసులో బోరుగడ్డ అనిల్‌కు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే ఇప్పటికే బోరుగడ్డ అనిల్‌పై పలు కేసులు ఉన్న కారణంగా ఆయన రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. దీంతో జైలు నుంచి తీసుకొచ్చి బీజేపీ నేతలపై దాడి కేసులో మంగళగిరి కోర్టులో ప్రవేశట్టడంతో 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మంగళవారం మంగళగిరికి తీసుకురానున్నారు. కస్టడీలో అనిల్‌ను పోలీసులు విచారించనున్నారు.
Also Read :
ఏపీ ప్రథమ స్థానం.. ఇది మన రాష్ట్ర దుస్థితి: చంద్రబాబు, జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్