వైసీపీకి షాకిచ్చిన టీడీపీ.. ఈసీకి కంప్లైంట్
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో డ్రగ్స్ కేసుల విషయంలో అలజడి సృష్టించిన వైసీపీ, తెలుగుదేశం పార్టీలు తమ పోరాటాన్ని దేశ రాజధాని ఢిల్లీకి మార్చాయి. గత వారం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి టీడీపీ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని, పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. తాజాగా సోమవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు కడనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, నిమ్మల కిష్టప్ప ఎన్నికల సంఘాన్ని కలిశారు. వైసీపీ […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో డ్రగ్స్ కేసుల విషయంలో అలజడి సృష్టించిన వైసీపీ, తెలుగుదేశం పార్టీలు తమ పోరాటాన్ని దేశ రాజధాని ఢిల్లీకి మార్చాయి. గత వారం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి టీడీపీ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని, పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. తాజాగా సోమవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు కడనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, నిమ్మల కిష్టప్ప ఎన్నికల సంఘాన్ని కలిశారు. వైసీపీ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండున్నర సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలపై జరిపిన దాడుల గురించి ఓ సమగ్రమైన నివేదికను టీడీపీ నేతలు ఈసీకి అందించారు. రాజకీయం రాజుకుంటున్న కొద్దీ తమ పోరును అధికార, ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీని వేదికగా మార్చుకొని విమర్శలకు పదును పెట్టేందుకు రెడీ అయ్యాయి.