ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటాసన్స్ ఆసక్తి

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ(Domestic airlines) ఎయిర్ ఇండియా(Air India) కొనుగోలుకు సంబంధించి బిడ్లను దాఖలు చేసేందుకు ఈ నెల చివరికి గడువు ముగియనున్న నేపథ్యంలో టాటా గ్రూప్ బిడ్(Tata Group bid) దాఖలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే టాటా సన్స్(Tata Sons) విమానయాన రంగంలో వ్యాపారాలను కలిగి ఉన్నారు. అంతేకాకుండా, ఆటోమొబైల్(Automobile), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology), స్టీల్(Steel) రంగాల్లో ఈ సంస్థ ఆదరణ కలిగి ఉంది. ప్రస్తుతానికి నిధులు, వ్యాపార నిర్మాణం గురించి […]

Update: 2020-08-14 07:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ(Domestic airlines) ఎయిర్ ఇండియా(Air India) కొనుగోలుకు సంబంధించి బిడ్లను దాఖలు చేసేందుకు ఈ నెల చివరికి గడువు ముగియనున్న నేపథ్యంలో టాటా గ్రూప్ బిడ్(Tata Group bid) దాఖలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే టాటా సన్స్(Tata Sons) విమానయాన రంగంలో వ్యాపారాలను కలిగి ఉన్నారు.

అంతేకాకుండా, ఆటోమొబైల్(Automobile), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology), స్టీల్(Steel) రంగాల్లో ఈ సంస్థ ఆదరణ కలిగి ఉంది. ప్రస్తుతానికి నిధులు, వ్యాపార నిర్మాణం గురించి చర్చించలేదని టాటాసన్స్ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. అయితే, చర్చలు జరిగిన తర్వాత ఇందులో వేరే భాగస్వామిని చేర్చుకునే ప్రతిపాదనలేమీ లేవని, ప్రభుత్వ ప్రతిపాదనలపై పూర్తి స్థాయి అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

కాగా, 2019 మార్చి నాటికి ఎయిర్ ఇండియా(Air India) అప్పులు రూ. 58,351.93 కోట్లుగా ఉంది. ప్రభుత్వం సైతం ఏం చేయలేని స్థితిలో ఉండటంతో ఎయిర్ ఇండియా విక్రయాని(For sale)కి సిద్ధమైంది. అయితే, ఈ కంపెనీని కొనుగోలు చేసే ఎవరైనా ఈ అప్పులను చీలించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. గతంలో ఎయిర్ ఇండియాను విక్రయించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు. ఇక ప్రస్తుత ఏడాది కొవిడ్-19 కారణంగా ఆలస్యమైంది.

Tags:    

Similar News