కారు కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్.. లోన్ స్కీమ్ సూపర్ ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్ : ఒక కారు కొంటే బాగుండూ.. కానీ ఎలా..? ఏదైనా బ్యాంకు లోన్ ఇస్తుందా.. కారు ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా. అయితే మీకోసమే ఈ తీపి కబురు. లోన్ స్కీమ్ పేరుతో మహా సూపర్ కార్ లోన్ స్కీమ్ తీసుకొచ్చారు. ప్రముఖ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర కలసి ఈ లోన్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్కీమ్ వలన మీరు ఎప్పటి నుంచే కారు […]
దిశ, వెబ్‌డెస్క్ : ఒక కారు కొంటే బాగుండూ.. కానీ ఎలా..? ఏదైనా బ్యాంకు లోన్ ఇస్తుందా.. కారు ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా. అయితే మీకోసమే ఈ తీపి కబురు. లోన్ స్కీమ్ పేరుతో మహా సూపర్ కార్ లోన్ స్కీమ్ తీసుకొచ్చారు. ప్రముఖ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర కలసి ఈ లోన్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్కీమ్ వలన మీరు ఎప్పటి నుంచే కారు కొనుగోలు చేయాలి అనే కల ఇట్టే తీరిపోతుంది. టాటా మోటార్స్ కారు కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర గుడ్ న్యూస్ చెప్పింది. మోటార్స్ కారు కొనుగోలు చేయడానికి సులభంగా రుణాలు అందిస్తుంది. అతి తక్కువ వడ్డీతో మంచి బెనిఫిట్స్‌తో ఉద్యోగులు కానీ, స్వయం ఉపాధి పొందుతున్నవారు ఇందులో సులభంగా రుణం పొందవచ్చు. అంతేకాకుండా వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంది. 7.15 శాతం నుంచి ప్రారంభమౌతోంది. ఈ రుణ రేటు రెపో లింక్డ్ లెండింగ్ రేటుతో RLLR అనుసంధానమై ఉంటుంది. కారు ఆన్ రోడ్ ధరలో 90 శాతం మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు.
లోన్ ముఖ్యమైన విషయాలు..
-
ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు రుణం తీసుకోవడానికి అర్హులు.
-
లోన్ టెన్యూర్ 7 ఏళ్లు.
-
లక్షకు ఈఎంఐ రూ.1517 నుంచి ప్రారంభమౌతోంది.
-
కార్పొరేట్ శాలరీ అకౌంట్, ఇప్పటికే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేటులో 0.25 శాతం రాయితీ కూడా లభిస్తుంది.
-
అంతేకాకుండా మాన్సూన్ ధమాకా ఆఫర్ కూడా ఒకటి ఉంది. ఇందులో భాగంగా కారు రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ పొందొచ్చు. సెప్టెంబర్ చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.