ఆర్ఎంపీ డాక్టర్ ఇంట్లో రూ.66 లక్షలు దొరికాయ్.. ఎక్కడంటే!
దిశ, హుస్నాబాద్ : చిన్నాచితక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రథమ చికిత్సలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ఆర్‌ఎంపీ వైద్యుడి ఇంట్లో రూ.66లక్షలు దొరికాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఆంజనేయులు ఇంట్లో శనివారం టాస్క్‌ఫోర్స్, పోలీసు ఉన్నతాధికారులు సోదాలు జరిపారు. ఈ దాడుల్లో రూ.66 లక్షల 11వేల100లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నగదును ఐటీశాఖ […]
దిశ, హుస్నాబాద్ : చిన్నాచితక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రథమ చికిత్సలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ఆర్‌ఎంపీ వైద్యుడి ఇంట్లో రూ.66లక్షలు దొరికాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు అంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఆంజనేయులు ఇంట్లో శనివారం టాస్క్‌ఫోర్స్, పోలీసు ఉన్నతాధికారులు సోదాలు జరిపారు.
ఈ దాడుల్లో రూ.66 లక్షల 11వేల100లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన నగదును ఐటీశాఖ అధికారులకు అప్పగించడంతో పాటు ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. సోదాల్లో హుస్నాబాద్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్ఐలు శ్రీధర్, రవి, టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.