స్విమ్మింగ్ అంటే భయం : తాప్సీ
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను క్వారంటైన్ పోస్ట్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. సెట్లోని ఒక్కో ఫొటో షేర్ చేస్తూ ఒక్కో స్టోరీ చెప్తున్న తాప్సీ.. ఆ రోజు, ఆ టైమ్లో తన అనుభవాలను పంచుకుంటూ.. అభిమానులు తన గురించి తెలుసుకునేందుకు మరింత అవకాశం కల్పిస్తోంది. తాజాగా మిషన్ మంగళ్, బద్లా, పింక్ చిత్రాల్లోని ఫొటో స్టోరీ చెప్పిన తాప్సీ.. ఈ సారి యాడ్ స్టోరీ పోస్ట్ చేసింది. https://www.instagram.com/p/CC2ZJUFpG9Y/?utm_source=ig_web_copy_link తను స్విమ్మింగ్ ఫూల్లో ఉన్న ఫొటో ఉమెన్స్ […]
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను క్వారంటైన్ పోస్ట్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. సెట్లోని ఒక్కో ఫొటో షేర్ చేస్తూ ఒక్కో స్టోరీ చెప్తున్న తాప్సీ.. ఆ రోజు, ఆ టైమ్లో తన అనుభవాలను పంచుకుంటూ.. అభిమానులు తన గురించి తెలుసుకునేందుకు మరింత అవకాశం కల్పిస్తోంది. తాజాగా మిషన్ మంగళ్, బద్లా, పింక్ చిత్రాల్లోని ఫొటో స్టోరీ చెప్పిన తాప్సీ.. ఈ సారి యాడ్ స్టోరీ పోస్ట్ చేసింది.
https://www.instagram.com/p/CC2ZJUFpG9Y/?utm_source=ig_web_copy_link
తను స్విమ్మింగ్ ఫూల్లో ఉన్న ఫొటో ఉమెన్స్ హార్లిక్స్ యాడ్ షూటింగ్లో భాగమని తెలిపింది. ఆ టైమ్లో తనకు జాయ్ ఫుల్గా అనిపించిందన్న తాప్సీ.. కానీ ప్రతీసారి అలా ఉండలేనని అంటోంది. ‘చిన్నప్పుడు కొలనులో మునిగిపోయా.. దాంతో ఈత నేర్చుకునేందుకు చాలా భయపడ్డాను. ఆ భయం నుంచి బయటకొచ్చి.. తొమ్మిదేళ్ల క్రితం స్విమ్మింగ్ నేర్చుకున్నా’ అని చెప్పింది. ఒకే తరగతికి చెందిన పిల్లలందరితో కలిసి ఇండోర్ పూల్లో ఈత కొట్టడం ఇంకా గుర్తుందని.. అది తలచుకుంటే ఒక విషయాన్ని నేర్చుకునేందుకు వయసుతో సంబంధం లేదని అనిపిస్తోందని తెలిపింది. ఇప్పటికీ తనలో చిన్నపిల్లల స్వభావం పోలేదనిపిస్తోందని చెప్పుకొచ్చింది తాప్సీ.