తిరుపతిలో వింత ఘటన.. భూమిలోంచి బయటకు వచ్చిన ట్యాంక్

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ఇంట్లో వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా… ఈ వింత ఘటన బయటకు వచ్చింది. తిరుపతి కార్పొరేషన్ 20వ డివిజన్ ఎం.ఆర్ పల్లిలోని శ్రీకృష్ణా నగర్‌లో గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం ….వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా.. అది భూమిలోంచి ఒక్కసారిగా పైకి వచ్చింది. ఆ వాటర్ ట్యాంక్ 25 అడుగుల ఒరలతో ఉంది. […]

Update: 2021-11-26 06:18 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ఇంట్లో వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా… ఈ వింత ఘటన బయటకు వచ్చింది. తిరుపతి కార్పొరేషన్ 20వ డివిజన్ ఎం.ఆర్ పల్లిలోని శ్రీకృష్ణా నగర్‌లో గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం ….వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా.. అది భూమిలోంచి ఒక్కసారిగా పైకి వచ్చింది. ఆ వాటర్ ట్యాంక్ 25 అడుగుల ఒరలతో ఉంది. దీనితో ఆ మహిళ భయబ్రాంతులకు గురి అయి కేకలు వేసింది. దీనితో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ కేకలు విన్న భర్త హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాడు. నిచ్చెన సహాయంతో తన భార్యను బయటకు లాగాడు. మహిళ తీవ్ర గాయాలకు గురి అయింది.

ఎస్వీ యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్స్ బృందం ఈ ఘటనపై పరిశోధన చేసింది. పరిశోధన తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గతంలో జరిగిన ఇలాంటి సంఘటనను గుర్తు చేశారు. రాయలసీమలో ఇది జరగడం తొలిసారి అని చెప్పారు. భారీగా వర్షాలు సంభవించడం వలన భూమి పొరలలో మార్పు చోటుచేసుకుంది. దీని వల్ల భయపడాల్సిన పని లేదని తెలిపారు. ఇది భూమిలో జరిగే సహజమైన పరిణామమేనని వివరించి చెప్పారు.

Tags:    

Similar News